టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు విజృంభించారు. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), కెప్టెన్ సల్మాన్ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సైమ్ అయూబ్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు) రాణించారు.
వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ఖ్వాజా నఫాయ్ (5) తొందరగా ఔటయ్యాడు. మొత్తంగా పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో బాబర్ ఆజమ్ ను కనీసం బ్యాటింగ్ కు దింపలేదు. ఇక లక్ష్య ఛేదనలో నమీబియా 51 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.