ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడుతాడా.?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అనుమతి ఇవ్వకపోవడంతో సూర్యకుమార్ యాదవ్‌కు
By Medi Samrat Published on 19 March 2024 3:45 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అనుమతి ఇవ్వకపోవడంతో సూర్యకుమార్ యాదవ్‌కు, ముంబై ఇండియన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ట్వంటీ20 స్పెషలిస్ట్, సూర్యకుమార్ మంగళవారం బెంగళూరులోని NCAలో ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ చేయించుకున్నాడు. అయితే, NCA మేనేజ్‌మెంట్ క్లియరెన్స్‌ను ఇవ్వలేదు. దీంతో ముంబై ఇండియన్స్ తరపున ఈ ఐపీఎల్ సీజన్ లో సూర్య ఎప్పుడు అడుగుపెడతాడా అన్నది తెలియాల్సి ఉంది.
క్లియరెన్స్ రాకపోవడంతో సూర్యకుమార్ ఓపెనింగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో మార్చి 24న అహ్మదాబాద్‌లో జరగనుంది. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ 20 సిరీస్‌లో భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరించాడు సూర్యకుమార్. ఆ తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే ఇంకా సూర్యకుమార్ యాదవ్ కోలుకోలేదు. మంగళవారం అతని సోషల్ మీడియా పోస్ట్ చూడగా.. తన నిరాశను వ్యక్తం చేస్తూ హార్ట్‌బ్రేక్ ఎమోజీని పంచుకున్నాడు.
మార్చి 21న జరగబోయే మరో ఫిట్‌నెస్ పరీక్షలో అతనికి క్లియరెన్స్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే ముంబై ఇండియన్స్ శిబిరంలో సూర్య చేరే అవకాశం ఉంది. MI రెండవ గేమ్.. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతుంది. ఆ మ్యాచ్‌కి సూర్య కుమార్ యాదవ్ అందుబాటులో ఉండగలడనే నమ్మకం ఉంది. సోమవారం మీడియాతో ముంబయి ఇండియన్స్ కోచ్ మార్క్ బౌసర్ మాట్లాడుతూ సూర్యకుమార్ కొన్ని మ్యాచ్‌లను కోల్పోయే అవకాశం ఉందని అన్నాడు. BCCI నుండి సూర్యకుమార్‌కు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు.