సన్‌రైజర్స్‌తో తలపడనున్న ముంబై ఇండియన్స్.. రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులు
Mumbai Indians will face Sunrisers Hyderabad Today. ఐపీఎల్-2023లో మంగళవారం మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 18 April 2023 7:02 PM ISTఐపీఎల్-2023లో మంగళవారం మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు, ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. పాయింట్ల పట్టికలో ఈ జట్ల పరిస్థితి దారుణంగా ఉండడంతో నేటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. రోహిత్ శర్మ గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. కడుపు నొప్పితో బాధపడుతూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్ మాత్రమే చేశాడు. గత మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహించిగా.. మ్యాచ్ గెలిచింది. కాగా, నేటి మ్యాచ్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ రంగంలోకి దిగే అవకాశం ఉంది.
అయితే రోహిత్ శర్మను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం 5,986 పరుగులు చేశాడు. అంటే ఆరు వేల పరుగుల క్లబ్‌లో చేరాలంటే 14 పరుగులు మాత్రమే కావాలి. రోహిత్ శర్మ కంటే ముందు ఐపీఎల్ చరిత్రలో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. ఈ రోజు రోహిత్ శర్మ 14 పరుగులు చేస్తే.. ఆరువేల క్లబ్‌లో చేరిన నాల్గవ బ్యాట్స్‌మెన్‌గా అవుతాడు. అంతేకాదు రోహిత్ శర్మ మరో మూడు సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 250 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటి వరకు భారత్‌లో ఒక్క ఆటగాడు కూడా 250 సిక్సర్లు కొట్టలేదు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్(357) పేరిట ఉంది. ఏబీ డివిలియర్స్ 251 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 247 సిక్సర్లతో మూడవస్థానంలో ఉన్నాడు. ఈ రెండు రికార్డులు చేయడం రోహిత్‌కు పెద్ద కష్టమైన పనేం కాదు.
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. రెండు గెలిచి, రెండు ఓడింది. ముంబై జట్టుకు నాలుగు పాయింట్లు ఉన్నా.. నెట్ రన్ రేట్ మాత్రం మైనస్‌లో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా నాలుగు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. ఆ జట్టుకు కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేట్ కూడా మైనస్‌లో ఉంది. ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి మరి.