జడ్డూ, రాహుల్.. అవుట్
ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో జరగబోయే రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
By Medi Samrat Published on 29 Jan 2024 9:03 PM ISTఇంగ్లండ్‌తో వైజాగ్‌లో జరగబోయే రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లకు వైజాగ్ టెస్టులో రెస్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జడేజాకు హ్యామ్ స్ట్రింగ్ ఇంజురీ అయిందని, రాహుల్ కుడి క్వాడ్రిసెప్స్ నొప్పి ఉందని ఫిర్యాదు చేశాడు. వైజాగ్‌లో ఫిబ్రవరి 02, 2024 నుండి రెండవ టెస్ట్ మ్యాచ్ మొదలవ్వనుంది. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షించనుంది. ఇక సెలక్షన్ కమిటీ సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను భారత జట్టులోకి చేర్చిందని బీసీసీఐ తాజా ప్రకటనలో తెలిపింది.
ఇంగ్లండ్‌తో జరగనున్న 2వ టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెఎస్ భరత్ (డబ్ల్యుకె), ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకె), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్.సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (VC), అవేష్ ఖాన్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.