సన్ రైజర్స్ కు మరో ఓటమి
అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
By Medi Samrat Published on 31 March 2024 7:30 PM ISTఅహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ లో అనుకున్నంత స్కోరును చేయలేకపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సొంత గడ్డపై గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
సన్ రైజర్స్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 16, హెడ్ 19, అభిషేక్ శర్మ 29, మార్క్రమ్ 17, క్లాసెన్ 24, షాబాజ్ అహ్మద్ 22, అబ్దుల్ సమద్ 29 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ డకౌటయ్యారు. సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. మోహిత్ శర్మ 3, ఒమర్‌జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. 163 పరుగుల ఛేదనలో గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (25), కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (36) రాణించారు. వన్ డౌన్ లో వచ్చిన సాయిసుదర్శన్ 45 పరుగులు చేయగా, మిల్లర్ 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 1, మయాంక్ మార్కండే 1, కమిన్స్ 1 వికెట్ తీశారు.