క్యాసినో న‌డుపుతున్న తండ్రీకొడుకులు.. ఏసీపీ పుత్ర‌ర‌త్నం కూడా ఉన్నాడు..

Father and son were running casinos in posh locality. దక్షిణ ఢిల్లీ పోలీసులు భారీ క్యాసినోను ఛేదించారు. ముగ్గురు చార్టర్డ్ అకౌంటెంట్స్

By Medi Samrat  Published on  12 Dec 2021 6:33 PM IST
క్యాసినో న‌డుపుతున్న తండ్రీకొడుకులు.. ఏసీపీ పుత్ర‌ర‌త్నం కూడా ఉన్నాడు..

దక్షిణ ఢిల్లీ పోలీసులు భారీ క్యాసినోను ఛేదించారు. ముగ్గురు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ క్యాసినోను నడుపుతూ ఉన్నారు. క్యాసినోలో ఉన్న ఢిల్లీ పోలీసు ఏసీపీ కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది క్యాసినో సౌత్ ఎక్స్‌టెన్షన్స్‌లోని పోష్ ఏరియా M బ్లాక్‌లో నడుస్తోంది. కాసినోలను తండ్రీ కొడుకులు నడుపుతున్నారు. సౌత్ డిస్ట్రిక్ట్ పోలీసులు ఈ అనుమతులు లేని క్యాసినోపై దాడి చేశారు. ఏకంగా 16 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఢిల్లీ పోలీసు ఏసీపీ కుమారుడు కూడా ఉన్నారు. గత 10 నెలలుగా క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

అరెస్టయిన వ్యక్తులు తండ్రీ కొడుకులు మనీష్ బిందాల్, అంకుర్ బిందాల్ గా గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు. మూడో నిందితుడు ఢిల్లీ పోలీసు ఏసీపీ కుమారుడు వివేక్ జైన్ అని తెలిపారు. ఆకాష్ శారదా అనే చార్టర్డ్ అకౌంటెంట్‌ను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమ క్యాసినో నుంచి 1000 ప్లేయింగ్ చిప్స్, 33 ఇటుకలు, సుమారు లక్షా 95 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ అతుల్ త్యాగి బృందం ఈ అక్రమ క్యాసినోను ఛేదించింది. క్యాసినో నిర్వహించేందుకు స్థానిక పోలీసులకు నెలకు లక్షన్నర రూపాయలు చెల్లించేవారని నేరగాళ్లు వెల్లడించారు. క్యాసినో నడిపేందుకు డబ్బులు తీసుకుంటున్న పోలీసులను కూడా విచారణలో చేర్చి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Next Story