భారత జట్టుకు సెల‌క్ట్ అవ‌గానే హృదయాన్ని హత్తుకునే పోస్ట్ చేసిన ధృవ్ జురెల్

భారత జట్టుకు ఎంపికైన తర్వాత ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ను

By Medi Samrat  Published on  14 Jan 2024 10:59 AM GMT
భారత జట్టుకు సెల‌క్ట్ అవ‌గానే హృదయాన్ని హత్తుకునే పోస్ట్ చేసిన ధృవ్ జురెల్

భారత జట్టుకు ఎంపికైన తర్వాత ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. తన కెరీర్‌కు మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఇది ఆరంభం మాత్రమేనని వాగ్దానం చేశాడు.

ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, కేఎస్ భరత్‌తో పాటు ధృవ్ జురెల్ కూడా జట్టుకు ఎంపిక‌య్యాడు.

జట్టుకు ఎంపికైన తర్వాత ధృవ్ జురెల్ తన X ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు.. ఆ పోస్టులో.. తల్లిదండ్రుల త్యాగానికి ఈత‌డు ధన్యవాదాలు తెలిపాడు. అమ్మా నాన్నల త్యాగాల వల్లే నేను బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడగలిగాను. ఇది తన కెరీర్‌కు ప్రారంభం మాత్ర‌మేన‌ని.. ఇంకా సాదించాల్సింది చాలా ఉందని పేర్కొన్నాడు. ధృవ్ జురెల్ పోస్టు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ధృవ్ జురెల్ ఆడాడు. 13 మ్యాచ్‌లలో 21.71 సగటుతో 172 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 152 పరుగులు చేశాడు, అతడి అత్యుత్తమ స్కోరు 34 నాటౌట్. డెత్ ఓవర్లలో అతని షాట్ మేకింగ్ అతడిని వెలుగులోకి తెచ్చింది. అలాగే 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌ల్లో 46.47 సగటుతో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలతో 790 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 249. జురెల్ దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు

రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), కెఎస్ భరత్ (వికెట్ కీప‌ర్‌), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ., కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

Next Story