టీమిండియా జెర్సీపై ఆ పేరు ముద్రించడానికి ఇష్టపడని బీసీసీఐ.. పీసీబీ ఆగ్రహం..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌తో పాటు దుబాయ్‌లోని మూడు నగరాల్లో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించబడుతుంది
By Medi Samrat Published on 21 Jan 2025 2:33 PM ISTఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌తో పాటు దుబాయ్‌లోని మూడు నగరాల్లో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించబడుతుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియా మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ టోర్నీకి ముందు కొత్త వివాదం తలెత్తింది. ఈ టోర్నీ నిర్వాహణ కర్త(హోస్ట్)గా ఉన్న పాకిస్థాన్ పేరు భారత జట్టు జెర్సీపై ముద్రించలేదు. దీనిపై పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని నిర్వహిస్తోంది.. అయితే భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని, టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుందని.. భారత జట్టు జెర్సీపై పాకిస్తాన్ పేరు లేదని IANS నివేదించింది. దీనిపై పాక్ కోపంగా ఉంది.
బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకొచ్చిందని పీసీబీ అధికారి ఒకరు ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్ల సమావేశానికి కెప్టెన్ రోహిత్‌ను పాకిస్తాన్‌కు పంపడానికి భారత బోర్డు నిరాకరించింది. ఓపెనింగ్ సెర్మనీకి కెప్టెన్‌ని పాకిస్థాన్‌కు పంపడానికి అనుమతించలేదు. ఇప్పుడు జెర్సీపై కూడా ఆతిథ్య దేశం (పాకిస్థాన్) పేరును ముద్రించడం ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. ICC దీన్ని అనుమతించదని.. మాకు పూర్తిగా సహాయం చేస్తుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నామన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 8 జట్ల మధ్య మొత్తం 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్‌లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లకు కూడా చోటు దక్కింది. గ్రూప్ దశలో అన్ని జట్లు ఇతర 3 జట్లతో ఆడతాయి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.