సిరో సర్వైలెన్స్ సంచలనం.. బెజవాడలో 40 శాతానికి కరోనా వచ్చి పోయింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 12:31 PM IST
సిరో సర్వైలెన్స్ సంచలనం.. బెజవాడలో 40 శాతానికి కరోనా వచ్చి పోయింది

షాకింగ్ అంశం ఒకటి బయటకు వచ్చింది. ఏపీ రాజధానికి దగ్గరగా ఉండే బెజవాడ.. ఆ చుట్టుపక్కల నివసించే వారిలో 40 శాతం మందికి కరోనా వచ్చి పోయిందన్న విషయాన్ని నిర్దారించారు. బెజవాడ.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిరో సర్వైలెన్సు సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం 43.8 శాతం మంది వైరస్ ప్రభావానికి లోనయ్యారు. ఇందులో 40.5 శాతం మందికి కరోనా సోకటమే కాదు.. ఎలా వచ్చిందో అలా పోయిందని చెబుతున్నారు. వీరందరికి ఎలాంటి అనుమానిత లక్షణాలు లేకపోవటం గమనార్హం.

మిగిలిన 3.3 శాతం మంది మాత్రం అనుమానిత లక్షణాలు కనిపించటంతో పరీక్షలు చేయించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎలా సాగింది? అదెంతమందికి సోకిందన్న విషయాన్ని తేల్చేందుకు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ సిరో సర్వైలెన్సు ను నిర్వహించారు. సదరు సర్వే ప్రకారం క్రిష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందిలో 19.41 శాతానికి కరోనా వచ్చి వెళ్లిందని.. విజయవాడ అర్బన్ లో 933 మందిలో 378 మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లుగా తేలాయి.

భవంతులు.. అపార్ట్ మెంట్లు.. చిన్న ఇళ్లు.. గుడిసెలు ఉన్న ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నక్రిష్ణలంకలో 39 మంది నమూనాలు పరీక్షించగా 16 మందికి వైరస్ సోకి నయమైన విషయాన్ని గుర్తించారు. అదే రీతిలో బెజవాడలో పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొన్నట్లుగా తేల్చారు. ఈ నెల ఆరు నుంచి పదిహేను మధ్యలో జరిగిన ఈ సర్వేలో అనుమానిత లక్షణాలు కనిపించలేదని చెప్పిన వారికి మాత్రమే పరీక్షలు చేసినట్లుగా కలెక్టర్ ఇంతియాజ్ చెబుతున్నారు.

బెజవాడలో మొత్తం 1.80లక్షల మందికి పరీక్షలు చేయగా ఆరువేల మందికి వైరస్ సోకినట్లుగా తేలింది. నెలలో కేసులు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్యను నగర జనాభాతో మదింపు చేసిన సమయంలో ఇది మొత్తం 43 శాతం ఉన్నట్లుగా తేల్చారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో తీసుకున్న శాంపిల్స్.. వాటిలో వైరస్ సోకి నయమైనట్లుగా గుర్తించిన వారి సంఖ్యను చూస్తే..

ప్రాంతం తీసుకున్న శాంపిళ్లు వైరస్ సోకి నమయైనోళ్లు

రాణిగారి తోట 40 29

లంబాడిపేట 38 18

రామలింగేశ్వరనగర్ 43 18

దుర్గాపురం 43 17

మధురానగర్ 32 20

గిరిపురం 33 18

ఎన్టీఆర్ కాలనీ 43 16

ఆర్ఆర్ పేట 40 16

లబ్బీపేట 21 04

పటమట 13 05

కానూరు 69 08

గొల్లమూడి 150 14

గొల్లపల్లి 140 09

Next Story