Fact Check : 35 సంవత్సరాల ఖుష్బూ మీర్జాను ఇస్రో డైరెక్టర్ గా నియమించారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 July 2020 10:10 AM ISTఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సైంటిస్ట్ ఖుష్బూ మీర్జాకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమెను ఇస్రో డైరెక్టర్ గా నియమించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
“Proud to be AMU alumnus, 35-year-old scientist Kushbu Mirza, has been promoted as Director in ISRO. She is an alumnus of Aligarh Muslim University and only the 2nd Muslim Scientist after Dr.A.P.J. Abdul Kalam to hold this rank at ISRO,” అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Proud to be AMU alumnus👍35 year old scientist Ms.Kushbu Mirza,has been promoted as a Director in ISRO.She is an alumnus of Aligarh Muslim University and only the 2nd Muslim Scientist after Dr.A.P.J. Abdul Kalam to hold this rank at ISRO.https://t.co/EbIXSI762N@manoj2367
— Yasmin Zafar # INC🇮🇳 (@YasminZafar123) July 8, 2020
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైనందుకు చాలా గర్వంగా ఉంది. 35 సంవత్సరాల ఖుష్భూ మీర్జా ను ఇస్రో డైరెక్టర్ గా నియమించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆమె అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి అవ్వడమే కాకుండా, డాక్టర్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ తర్వాత ఇస్రోలో ఈ స్థానాన్ని దక్కించుకున్న రెండవ ముస్లిం అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ:
ఖుష్బూ మీర్జాను సైంటిస్ట్-ఎఫ్ స్థాయి ర్యాంకుకు ప్రమోట్ చేశారు కానీ ఇస్రో డైరెక్టర్ గా అపాయింట్ చేయలేదు.
' Live Hindustan.com‘ లో కూడా ఆమె గురించి ఓ ఆర్టికల్ వచ్చింది. జూన్ 25, 2020న పబ్లిష్ చేసిన వార్తలో ఖుష్బూ మీర్జాను డైరెక్టర్ సైంటిస్ట్స్ ర్యాంక్-ఎఫ్ కు ప్రమోట్ చేశారని ఉంది.
వైరల్ అవుతున్న వార్తలో భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలాం తర్వాత ఇస్రో డైరెక్టర్ గా బాధ్యతలు అందుకుంది అని తెలిపారు. అబ్దుల్ కలాం ఇస్రో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించలేదు. ఆయన దేశం గర్వించదగ్గ SLV-III ప్రాజెక్ట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన డిఫెన్స్ రీసర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డి.ఆర్.డి.ఓ.) లోకి వెళ్లారు.
ఖుష్బూ ఇస్రోలో ఫుల్ టైమ్ సైంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఏ.పి.జె.అబ్దుల్ కలాంకు ఇచ్చిన ర్యాంకును ఇంకా ఇవ్వలేదు.
“Dear friends and well-wishers, With your blessings, I have been promoted to the next grade in my organization recently. Though it is a big milestone in my career. it’s not as big as some of you think. I have seen many news items spreading some false articles about me,” అంటూ ఖుష్బూ మీర్జా ట్వీట్ చేశారు.
'స్నేహితులు, శ్రేయోభిలాషుల దీవెనలతో నా వృత్తిలో భాగంగా ఒక స్థాయికి ఎదగలిగాను. నా కెరీర్ లో ఇదొక మైలురాయిగా భావిస్తున్నాను. మీరంతా భావిస్తున్న మైలు రాయిని ఇంకా చేరుకోలేదు. నా మీద ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.. వాటిలో తప్పుడు వార్తలు ఉన్నాయి' అని ఖుష్బూ మీర్జా తెలిపారు. తప్పుడు వార్తలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ ప్రకారం ఆమె అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అని తెలుస్తోంది. ఆమె మిషన్ చంద్రయాన్ లో కీలక పాత్ర పోషించారు. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని, భారతదేశ గొప్పదనాన్ని అంతరిక్ష రంగంలో చాటాలని న్యూస్ మీటర్ ఆశిస్తోంది.
వైరల్ అవుతున్నట్లుగా ఖుష్బూ మీర్జాను ఇస్రో డైరెక్టర్ గా ప్రమోట్ చేశారన్నది 'అబద్ధం'.