Fact Check : హెర్బల్ మైసూర్ పాక్ తింటే కరోనా వైరస్ దూరమవుతుందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 July 2020 3:22 AM GMT
Fact Check : హెర్బల్ మైసూర్ పాక్ తింటే కరోనా వైరస్ దూరమవుతుందా..?

కరోనా వైరస్ ను తట్టుకుని నిలబడాలంటే తప్పకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని ఎంతో మంది చెబుతూ ఉన్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పదార్థాలకు మార్కెట్ లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఓ స్వీట్ షాప్ ఓనర్ తమ మైసూర్ పాక్ తింటే కరోనా వైరస్ దరి చేరదని చెబుతూ ఓ పాంప్లేట్ ను తమిళంలో కొట్టించాడు. ఆ పాంప్లేట్ కాస్తా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. హెర్బల్ మైసూర్ పాక్ స్వీట్ ను కోయంబత్తూరు లోని ఓ స్వీట్ షాప్ లో తయారుచేస్తున్నారు. వారి షాపులో తయారైన ఆ మైసూర్ పాక్ ను తింటే కరోనా వైరస్ నుండి ఒక్క రోజులో కోలుకునే అవకాశం ఉందని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. సిద్ధా నిపుణుడైన షాపు ఓనరైన తాత దగ్గర ఉన్న రెసిపీ ద్వారా తయారు చేయబడిన స్వీట్ తో కరోనా వైరస్ నుండి ఒక్క రోజులో బయటపడచ్చట.

M1

కోవిద్-19 పేషెంట్స్ కు ఒక్క రోజులో నయమైంది.. ఇది నిజంగా అద్భుతం..! ఈ అద్భుతం చిన్నియంపలాయం , వెళ్ళాలోర్ లో తయారు చేయబడిన మైసూర్ పాక్ వలనే సాధ్యమైందంటూ తమిళ పాంప్లేట్ లో ఉంది.

తమ మైసూర్ పాక్ లో మొత్తం 19 రకాల మూలికలు ఉన్నాయని.. అవి మనిషిలో రోగనిరోధక శక్తిని పెంపొందించి.. కరోనా వైరస్ ను చంపేస్తాయని ఓనర్ చెబుతూ ఉన్నాడు. రోజుకు నాలుగు పీసుల మైసూర్ పాక్ ను తింటే కరోనా వైరస్ నుండి బయటపడొచ్చని పాంప్లేట్ లో రాశారు.

కొందరు తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఈ మైసూర్ పాక్ ను తయారు చేసే షాపుకు సంబంధించిన డీటెయిల్స్ ను షేర్ చేశారు.

తాము ఈ స్వీట్ ను వాడామని.. ఒక్కరోజులో కరోనా వైరస్ అంతమైందని మరికొందరు షేర్ చేశారు.

కొన్ని తమిళ వెబ్ సైట్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. స్వీట్ షాప్ ప్రొప్రయిటర్ శ్రీరామ్ ఒక్కరోజులో మైసూర్ పాక్ కరోనాను పారద్రోలుతుందని చెబుతున్నాడని పలు వెబ్ సైట్లు వార్తను రాసుకొచ్చాయి. హెర్బల్ మైసూర్ పాక్ కరోనాను ఒక్కరోజులో నాశనం చేసిందని శ్రీరామ్ చెప్పినట్లు కథనాలను ప్రచురించాయి.

నిజ నిర్ధారణ:

హెర్బల్ మైసూర్ పాక్ ను తినడం వలన కరోనా వైరస్ నుండి ఒక్క రోజులో నయం చేసుకోవచ్చన్నది 'అబద్ధం'

“Herbal Mysore Pak cures Coronavirus infection” అన్న కీ వర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేయగా పలు వార్తా కథనాలు కనపడ్డాయి. ఈ విషయం స్థానిక హెల్త్ డిపార్ట్మెంట్ కు, అధికారులకు తెలియడంతో ఈ ఘటనపై ఎంక్వయిరీని విధించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ జి.రమేష్ కుమార్ మాట్లాడుతూ ఇది నిబంధనలను ఉల్లఘించడమేనని తెలిపారు. ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్, 1897 కింద వాళ్లు చేసిన ప్రచారం చాలా తప్పు అని తేల్చి చెప్పారు. హెర్బల్ మైసూర్ పాక్ ను తినడం వలన కరోనా వైరస్ నుండి ఉపశమనం లభిస్తుందన్నది అబద్ధమని తెలిపారు.

Outlookindia.com రిపోర్ట్ ప్రకారం ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్ ఈ మైసూర్ పాక్ షాప్ పై రైడ్స్ నిర్వహించారు. కోయంబత్తూరు, చిన్నియంపాలయం లోని స్వీట్ షాపు మీద రైడ్స్ నిర్వహించడమే కాకుండా FSSAI సర్టిఫై చెందిన ప్రోడక్ట్ కానేకాదని తేల్చేశారు.

50 గ్రాముల ఈ మైసూర్ పాక్ ను 50 రూపాయలకు అమ్ముతున్నారు. కేజీ 800 రూపాయలకు అమ్ముతుండడం గమనించారు. 120 కేజీల హెర్బల్ మైసూర్ పాక్ ను సీజ్ చేశారు. షాపుకు సీల్ వేయడమే కాకుండా లైసెన్స్ ను క్యాన్సిల్ చేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు.

విశ్వాస్ న్యూస్ తమిళ్ కూడా ఈ వైరల్ వార్తను డీబంక్ చేసింది.

హెర్బల్ మైసూర్ పాక్ తినడం ద్వారా ఒక్కరోజులో కరోనా నయమవుతుందన్నది పచ్చి అబద్ధం.

Next Story