'ఆర్‌ఆర్‌ఆర్' నుంచి ఫ్యాన్స్‌కు మరో గిప్ట్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2020 11:31 AM IST
దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'(రౌద్రం రణం రుధిరం). స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలల పాటు ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. అన్‌లాక్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.
ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ అదరహో అనిపించాయి. ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చెర్రీకి జోడిగా ఆలియాభట్, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ నటీ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు.
తాజాగా శనివారం రాజమౌళి జన్మదినం సందర్భంగా మరో పోస్టర్‌ను చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి, భీమ్ చేతులు కలిపినట్లు ఈ పోస్టర్ ఉంది. దీనిపై నెటీజన్ల కామెంట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారిద్దరు కలిసిన సీన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.