మా పిల్ల‌లు ఒలంపిక్స్‌కు రెడీ : న‌మ్ర‌తా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2020 7:12 AM GMT
మా పిల్ల‌లు ఒలంపిక్స్‌కు రెడీ : న‌మ్ర‌తా

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విష‌యం తెలిసిందే. త‌న భ‌ర్త సినిమాలు, పిల్ల‌ల‌తో టూర్లు త‌దిత‌ర‌ విష‌యాల‌తో పాటు.. ఇంట్లో సంగ‌తుల‌ను కూడా న‌మ్ర‌తా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ వారిని ఉత్సాహ‌ప‌రుస్తుంటుంది.

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా గౌత‌మ్, సితార‌లు ఇంటికే ప‌రిమితం కావ‌డంతో వారు ఇంట్లో చేసే సంద‌డికి సంబంధించి అనేక విష‌యాల‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది న‌మ్ర‌తా‌. అయితే తాజాగా న‌మ్ర‌తా.. త‌న పిల్ల‌లు స్విమ్మింగ్ చేస్తున్న వీడియోల‌ను షేర్ చేస్తూ.. మా పిల్ల‌లు ఒలంపిక్స్‌కు రెడీ అని కామెంట్ పెట్టింది.

అంతేకాకుండా తాను.. పిల్ల‌ల‌ను వారికి న‌చ్చిన ప‌నుల‌ను చేయ‌మంటానని.. అన్నింటిలో ఆసక్తి చూప‌మ‌ని చెబుతుంటానని.. వ్యాయామంతో పాటు వేరే ఆట‌లు ఆడుతూ ఉంటే.. మీ మెద‌డు ఉత్తేజితం అవుతుంద‌ని చెబుతుంటాన‌ని.. త‌న పిల్ల‌ల‌ను వ్యాయామం, క్రీడ‌ల ప‌ట్ల ఎలా మోటివేట్ చేస్తుందో న‌మ్ర‌తా పోస్టులో పేర్కొంది.

Next Story