ద‌ర్శ‌క ధీరుడిపై కంఫ్లైంట్స్‌.. విషెస్‌లో ఇదో ర‌కం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2020 10:11 AM GMT
ద‌ర్శ‌క ధీరుడిపై కంఫ్లైంట్స్‌.. విషెస్‌లో ఇదో ర‌కం..!

దర్శక బాహుబ‌లి ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన‌రోజు నేడు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 'ఆర్ఆర్ఆర్' టీం ఆయ‌న‌కు వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు మూవీ టీం ఒక వీడియో విడుదల చేసింది.

ఈ వీడియోలో రాజ‌మౌళి అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ల ద‌గ్గ‌రి నుండి, కెమెరామెన్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌, మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌, ఆర్ట్ డైర‌క్టెర్‌, హీరోలు, నిర్మాత‌ వ‌ర‌కూ ఆయ‌న సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుండి‌ షూటింగ్ ముగిసేవ‌ర‌కూ త‌న క‌చ్చిత‌త్త్వంతో ఓ ప‌వ‌ర్‌పుల్ ఫ్యాక్ లాంటి సినిమాలా ముగించ‌డానికి ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తారో చిన్న‌, చిన్న కంప్లైంట్స్‌ చేస్తూ.. హ్యాపి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ వీడియోను విడుదల‌ చేశారు.హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు జ‌క్క‌న్న‌పై ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌మౌళి దర్శక రాక్షసుడు.. చంపేస్తున్నాడంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఎంతో క‌ష్ట‌మైన ఫైట్ సీన్ల‌ను త‌న‌తో షూట్ చేశారంటూ చ‌ర‌ణ్ పేర్కొన్నారు. ఒక్కో షాట్‌కు ఆయన ప‌ర్‌ఫెక్షన్‌తో మమ్మల్ని చావగొట్టేస్తున్నారని చిలిపి విమ‌ర్శ‌లు పేర్కొన్నారు.

అలాగే.. స్వ‌ర‌వాణి కీరవాణి, సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్ కుమార్‌తో పాటు ఇత‌ర‌ చిత్ర బృందం కూడా జ‌క్క‌న్న‌పై త‌మ‌త‌మ‌ చిలిపి ఆరోపణలను విషెస్ రూపంలో వీడియోలో బంధించి జ‌క్క‌న్న పుట్టిన‌రోజు కానుక‌గా డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్‌మీడియోలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇదిలావుంటే దర్శక ధీరుడి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటీనటులు, అభిమానుల నుండి అభినందనల వెల్లువ కురుస్తోంది.

Next Story