బిగ్‌బ్రేకింగ్: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
By సుభాష్ Published on 28 March 2020 1:39 AM GMTరంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చో టు చేసుకుంది. పెద్ద గోల్కొండ సమీపంలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లో టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో మృతి చెందిన వారంతా కర్ణాటకకు చెందిన కూలీలుగా గుర్తించారు. కాగా, కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండటంతో టాటా ఏస్‌లో తమ సొంత ఊళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయమై పోలీసులు మృతుల బంధువులకు సమాచారం అందించారు. గాయాలైన వారిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌తోపాటూ చుట్టుపక్కల జిల్లాలో చాలా మంది కూలీలు చిక్కుకుపోయారు.
వీరంతా తమ సోంత ఊళ్లకు వెళ్లాలనే తొందరపాటులో ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎవ్వరినీ కూడా అనుమతించడం లేదు. లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి వాహనాలు తిరగకుండా ఉన్న సమయంలో పోలీసులు ఈ వాహనాలను ఎలా అనుమతించారని పలువురు మండిపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.