చైనా సరిహద్దులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన
By సుభాష్ Published on 17 July 2020 10:35 AM ISTకేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా లడఖ్ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం సైనిక అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం శ్రీనగర్ వెళ్లనున్న రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. కాగా, భారత్-చైనా సైనికులకు ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ పర్యటిస్తున్నారు. సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న రాజ్‌నాథ్.. లేహ్‌లోని స్తక్నా ఫార్వర్డ్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి సైనికాధికారులతో మాట్లాడారు. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన సందర్భంగా చైనా సరిహద్దులో సైనిక విన్యాసాలు కొనసాగాయి.
ఇటీవల చైనా-భారత్ సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాస్తవానికి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌కు వెళ్లాల్సి ఉండగా, ఆకస్మాత్తుగా రాజ్‌నాథ్ పర్యటన రద్దు అయి ప్రధాని మోదీ పర్యటించారు. దీంతో రాజ్‌నాథ్ పర్యటన వాయిదా పడింది.