రాహుల్ హెచ్చరిక.. మోదీ అబద్ధాలకు మూల్యం తప్పదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 9:59 AM IST
రాహుల్ హెచ్చరిక.. మోదీ అబద్ధాలకు మూల్యం తప్పదు

తానెంత సీరియస్ గా మాట్లాడినా.. ప్రయోజనం కలగని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత రాహుల్ గాంధీ. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో ఆయన ప్రధాని మోడీ తీరును.. ఆయన ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల్ని ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కారు ఫెయిల్ అయ్యిందన్న వాదనను వినిపిస్తున్నారు. సరైన చర్యలు తీసుకోకుంటే కరోనా కేసులు 20 లక్షలు దాటుతాయన్న అంచనాను ఆయన గతంలో చెప్పటం.. అంతకాకున్నా.. ఆ బాటలోనే ప్రస్తుత పరిస్థితి సాగుతోంది.

పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరగటమే కాదు.. పెరుగుతున్న మరణాలపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ పరీక్షలు.. మరణాల విషయంలో మోదీ సర్కారు వాస్తవ ధోరణి తెలిసేలా చేయటం లేదని రాహుల్ మండిపడుతున్నారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అబద్ధాలే చెబుతుందని ఆరోపించారు. ఆయన అబద్ధాలకు దేశం ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

బీజేపీ సర్కారు వీలైనన్ని అబద్దాల్ని చెబుతోందని.. దేశ ప్రజలకు వాస్తవాల్ని తెలీయనీయటం లేదన్నారు. కొత్త గణన పద్దతిలో జీడీపీని సరిగా అంచనా వేయలేకపోయారని.. తాజాగా కోవిడ్ ను అడ్డుకోవటంలోనూ ఫెయిల్ అయ్యారన్నారు. మీడియాను భయపెడుతూ చైనా దూకుడు దేశానికి తెలీకుండా చేస్తున్నారన్నారు. అయితే.. ఈ భ్రమలన్ని త్వరలోనే వీడిపోతాయని చెబుతున్నారు. కాకుంటే.. మోదీ చెప్పిన అబద్ధాలకు దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న ఆవేదనన వ్యక్తం చేయటం గమనార్హం. ఇటీవల కాలంలో తరచూ గళం విప్పుతూ.. మోదీ సర్కారు తీరును నిశితంగా విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న రాహుల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది.

Next Story