సీనియర్ నటుడు రావి కొండలరావు కన్నుమూత
By Medi SamratPublished on : 28 July 2020 6:00 PM IST

సీనియర్ సినీ నటులు, రచయిత రావి కొండలరావు(88) మంగళవారం కన్నుమూశారు. గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. రావికొండల రావు స్వస్థలం శ్రీకాకుళం. 1932, ఫిబ్రవరి 11న జన్మించారు. 1958లో శోభ సినిమా ద్వారా సనీరంగ ప్రవేశం చేసిన ఆయన.. ఆరు దశాబ్దాలుగా రచయితగా, నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగారు.
600కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. రాముడు భీముడు, తేనె మనసులు, ప్రేమించి చూడు, అలీబాబా 40 దొంగలు, అందాల రాముడు, దసరా బుల్లోడు వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఆయన సతీమణి నటి రాధాకుమారి కూడా నటి. ఆమె 2012లో మృతిచెందారు. రావికొండల రావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Next Story