విజయవాడ ఘటనపై జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 6:16 AM GMT
విజయవాడ ఘటనపై జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్

విజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్‌కు ఫోన్‌ చేశారు. అగ్ని ప్రమాద వివరాలను అడిగితెలుసుకున్నారు. హోటల్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని.. ఈ తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగిందని ప్రధానికి జగన్‌ తెలిపారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారని.. దురదుష్టవశాత్తు కొంత మంది మృత్యువాత పడ్డారన్నారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు.

ఈ ప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్‌ చేశారు.



ఈ ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. 'విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.



Next Story