కోవిడ్ కేర్‌ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Aug 2020 3:39 AM GMT
కోవిడ్ కేర్‌ సెంటర్ స్వర్ణ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

విజ‌య‌వాడ‌ నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ప్ర‌మాద స్థ‌లంలో ముగ్గురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మృతి చెందిన వారిలో 5గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బంధువుల ద్వారానే మృతులను గుర్తిస్తామని అధికారులు తెలిపారు. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెయిడ్ క్వారం టైన్ నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

దాదాపు 50 మంది కరోనా బాధితులు స్వర్ణ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్నారు. 15 అంబులెన్స్‌లలో రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. భయంతో భవనం పైనుంచి దూకిన ఇద్దరు సిబ్బంది పరిస్థితి విషమంగా ఉంది.

షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story
Share it