విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్బర్‌లో చెలరేగిన మంటలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2020 12:49 PM GMT
విశాఖలో మరో ప్రమాదం.. షిప్పింగ్ హార్బర్‌లో చెలరేగిన మంటలు

విశాఖలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో ఉన్న మత్స్యకార బోటుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే మంటలను గుర్తించిన మత్య్సకారులు బోటులోంచి సముద్రంలోకి దూకారు. ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికి భారీగా ఆస్తినష్టం వాట్లినట్లు తెలుస్తోంది.

ఈరోజు తెల్లవారుజామున మత్య్సకారులు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో బోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బోటులో మంటలను గమనించిన ఇతర బోట్ల వారు వెంటనే అక్కడకు వెళ్లారు. పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చి.. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బోటు ఇంజిన్, క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ బోటులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. అదృష్టవశాత్తూ అవి పేలలేదని, లేకపోతే మరింత ఘోరం జరిగేదని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.50 మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు సమాచారం.

Next Story