కోర్టుకు రూ. 1 జరిమానా చెల్లించిన ప్రశాంత్‌ భూషణ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sept 2020 3:43 PM IST
కోర్టుకు రూ. 1 జరిమానా చెల్లించిన ప్రశాంత్‌ భూషణ్‌

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసులో సోమవారం రూపాయిని సుప్రీంకోర్టులో డిపాజిట్‌ చేశారు. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో ఆయనను దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు ఆయనకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. క్షమాపణ చెప్పాలని ధర్మాసనం ఆదేశించగా ఆయన నిరాకరించారు. దాంతో ఆయనకు సు‍ప్రీం కోర్టు జరిమానా విధించింది. అది చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వుంటుందని కోర్టు తెలిపింది. దీంతో ఆయన ఈరోజు తనకు విధించిన జరిమానా రూ.1 ను డిపాజిట్‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైన్ కడుతున్నంత మాత్రనా నేను తీర్పును అంగీకరించినట్టు కాదు. ఈ కేసుకు సంబంధించి నేను ఈ రోజు రివ్యూ పిటీషన్‌ను దాఖలు చేస్తాను. కోర్టు ధిక్కార నేరానికి సంబంధించిన తీర్పులపై అప్పీలు చేసుకునేందుకు ఓ విధానం రూపొందించాలి. ఈ విషయంలో నేను రిట్ పిటీషన్ కూడా దాఖలు చేశానని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే.. కోర్టు ధిక్కారం కేసులో సెప్టెంబర్‌ 15 కల్లా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ను రూ. 1 జరిమానా కట్టాలంటూ తీర్పు వెలువరించింది. లేకపోతే మూడు నెలలపాటు జైలుకు వెళ్లాల్సి వుంటుందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం నాడు సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో జరిమానా కట్టారు.

Next Story