వైసీపీ నేత విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో తన పోస్టులతో టీడీపీని, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులను ఎప్పుడూ ఇరకాటంలో పెడుతూ ఉంటారు. వాటిలో కొన్ని సెటైరికల్ గా.. ఇంకొన్ని డైరెక్ట్ విమర్శల్లా ఉంటాయి. తాజాగా కూడా విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుపై ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. ఆగస్టు 23వ తేదీన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేశాడు. 23.8.1995 ఎన్టీఆర్ సీఎం కుర్చీ లాక్కుని, ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు అంటూ విజయ సాయి రెడ్డి విమర్శించారు.

మామ ఎన్టీఆర్ వెనుక కత్తి చేతిలో పట్టుకుని నిలుచున్న చంద్రబాబు నాయుడు ఫోటో ను పోస్ట్ చేసి చర్చకు కారణమయ్యారు. అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను విజయ సాయి రెడ్డి ప్రస్తావించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి ఖతం చేసాడు అశోక్ గజపతి రాజు అంటూ విమర్శించారు. పార్టీ నుండి ఎన్టీఆర్ ను గెంటేసిన వారిలో అశోకగజపతి రాజు ఒకరని , ఎన్టీఆర్ ని గెంటేసిన వారిలో మొదటి పేరు చంద్రబాబు అయితే రెండో పేరు అశోక్ గజపతిదని విమర్శించారు. దివంగత ఎన్టీఆర్ టీడీపీని పోగొట్టుకున్న సమయంలో ఎంతో క్షోభ అనుభవించారని ఇప్పటికీ పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు.


సామ్రాట్

Next Story