చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా

Roja Fires On Chandrababu. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉన్నారు. కుప్పంలో ఆయ‌న‌ పలు వార్డుల్లో

By Medi Samrat  Published on  30 Oct 2021 6:42 PM IST
చంద్రబాబుపై విరుచుకుపడ్డ రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉన్నారు. కుప్పంలో ఆయ‌న‌ పలు వార్డుల్లో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి విజ్ఞ‌ప్తులు స్వీక‌రించారు. చంద్రబాబు పర్యటన నేప‌థ్యంలో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోకుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కుప్పం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల్లో వ్యూహాలపై నేత‌ల‌కు ఆయ‌న‌ సూచ‌న‌లు చేయనున్నారు. ఫ్లెక్సీల విషయంలో కూడా కుప్పం నియోజకవర్గంలో గొడవ మొదలైంది. గుడిపల్లి మండలం గుంజా రాళ్ళపల్లి వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేశారు. శాంతిపురంలోనూ టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు. టీడీపీ బ్యానర్లను గుర్తుతెలియని దుండగులు చించివేయగా దీనికి ప్రతీకారంగా వైసీపీ బ్యానర్లను టీడీపీ శ్రేణులు చించివేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులను కూడా తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. బాబు ఓ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుప్పంలో కనీసం ఇల్లు, ఆఫీసు కూడా ఏర్పాటు చేయని బాబు, నేడు ప్రజలను ఓట్లు అడుగుతుండడం హాస్యాస్పదం అని అన్నారు. ఏనాడైనా తన నియోజకవర్గంలో సంక్షేమాన్ని పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కుప్పం రండి తేల్చుకుందాం అంటూ సిగ్గులేకుండా సవాళ్లు విసురుతున్నారని విమర్శించారు. గతవారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించిన బాబు, ఇప్పుడు కుప్పం వచ్చి బాంబు డ్రామాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. కానీ ప్రజలు బాబు డ్రామాలను నమ్మేందుకు సిద్ధంగా లేరని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story