వారిద్దరికీ అధికారం ఇవ్వడమంటే పిచ్చోళ్ల చేతికి రాయి ఇవ్వడమే

KTR Fires On AIMIM And BJP. టీఆర్ఎస్ నేత కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ నేత బండి సంజయ్, మజ్లిస్ నేత

By Medi Samrat  Published on  29 Nov 2020 10:26 AM GMT
వారిద్దరికీ అధికారం ఇవ్వడమంటే పిచ్చోళ్ల చేతికి రాయి ఇవ్వడమే

టీఆర్ఎస్ నేత కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ నేత బండి సంజయ్, మజ్లిస్ నేత అక్బరుద్దీన్ లపై మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ నేత బండి సంజయ్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌ అంటరు.. మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ కూల్చేయండి అంటరు. ఇద్దరూ పిచ్చోళ్లే. వీరికి జీహెచ్‌ఎంసీ పీఠం ఇవ్వడం అంటే పిచ్చోడి చేతికి రాయివ్వటమేనని కౌంటర్ వేశారు. సర్జికల్‌ స్ట్రయిక్‌ చేయడానికి హైదరాబాద్‌ ఏమైనా శత్రుదేశమా అని కేటీఆర్ ప్రశ్నించారు.

మజ్లిస్‌, బీజేపీని గెలిపిస్తే గతంలో మాదిరిగా హైదరాబాద్‌ కర్ఫ్యూల నగరంగా మారుతుందని, ప్రశాంతంగా ఉంటున్న హిందు, ముస్లిం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తారని అన్నారు. గత ఆరేళ్లలో వేలకోట్లతో నగరంలో అభివృద్ధి చేపట్టామని, ఇది కొనసాగాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కట్టబెట్టాలని కేటీఆర్ కోరారు. బీజేపీ నాయకులు బిర్యానీ తిని, చాయ్‌ తాగి వెళ్లండి. కానీ ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దని అన్నారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు కేటీఆర్. చదువుకున్న వాళ్లు ట్వీట్లు చేస్తారు కానీ ఓట్లు మాత్రం వేయకపోవడం శోచనీయమని కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజైన డిసెంబర్ 1న విద్యావంతులు కాస్సేపు ఫేస్బుక్ లో కామెంట్లు కాస్త ఆపి పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేయండని అన్నారు. టీఆర్ఎస్‌ నచ్చకపోతే నోటాకు అయినా వేయండి అంటూ కేటీఆర్ సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉద్యోగులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ విషయంలో కుటుంబసభ్యులను, స్నేహితులను ప్రోత్సహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.


Next Story