ఏపీ బూతు రాజకీయాలపై కేటీఆర్ ఫైర్..!
KTR fire on AP whore politics. రాజకీయాల్లో అసహనం పనికి రాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏపీ సీఎంను పట్టుకుని బూతులు తిట్టడం
By అంజి Published on 23 Oct 2021 5:09 AM GMTరాజకీయాల్లో అసహనం పనికి రాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏపీ సీఎంను పట్టుకుని బూతులు తిట్టడం సరికాదని, రాజకీయాల్లో సభ్యత ముఖ్యమని అన్నారు. ప్రజల మనసు గెలుచకుంటేనే అధికారం సాధ్యం మవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజురాబాద్ బైపోల్‌తో పాటు పలు అంశాలపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఒక సీఎంని పట్టుకుని బూతులు తిట్టడం కరెక్ట్ కాదన్నారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిగాయన్నది పక్కనపెడితే, దానికి మూలం ఎక్కడుందో ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో గౌరవంగా ఉండాలన్నారు. ఇప్పుడు బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీశారు. తెలంగాణలో కూడా కొందరు నాయకులు సీఎంని పట్టుకుని అనరాని మంటలు అంటున్నారన్నారు.
అయితే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ ఫోకస్ మొత్తం కూడా తెలంగాణ మీదే ఉంటుందున్నారు. తాము ఢిల్లీ గులాములు, గుజరాత్‌కు బానిసలం కాదని కేటీఆర్ విమర్శించారు. పోరాటం చేసి 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక టీడీపీ 2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిందని, తెలంగాణలో అంతర్ధానమైందంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోపు పార్టీని మరింత దృఢంగా తయారు చేస్తామన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి టీఆర్‌ఎస్ ఓడించేందుకు కుట్ర పన్నాయని కేటీఆర్ ఆరోపించారు. అయితే కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజలు చిత్తు చేస్తారన్నారు. టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు వస్తదని రేవంత్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ రాజీలేనీ పోరాటం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.