రాముడి వారసుడు నరేంద్ర మోదీనే: బండి సంజయ్

పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము రాముడి పేరుతో ఓట్లు అడుగుతామని బండి సంజయ్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  12 March 2024 5:45 PM IST
bjp, bandi sanjay, comments,  congress, brs, telangana ,

 రాముడి వారసుడు నరేంద్ర మోదీనే: బండి సంజయ్ 

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికైతే ఎన్నికల షెడ్యూల్ రాలేదు కానీ.. ఏ క్షణాన్నైనా విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి. దాంతో.. ముందుగానే పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. కార్యకర్తలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో నిర్విహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము రాముడి పేరుతో ఓట్లు అడుగుతామని బండి సంజయ్ చెప్పారు. అయితే.. కాంగ్రెస్ నాయకులు బాబర్ పేరు చెప్పి ఓట్లు అడుగుతారా అంటూ ప్రశ్నించారు. అయోధ్య రాముడు బీజేపీ కార్యకర్తలకు మాత్రమే దేవుడంటూ సంచలన కామెంట్స్ చేశారు. రాముడి వారసుడు నరేంద్ర మోదీనే అని చెప్పారు. అయితే.. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉంటారనీ.. మరి కాంగ్రెస్ తరఫున ఎవరున్నారంటూ ప్రశ్నించారు బండి సంజయ్. 20 రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చుక్కలు చూపిస్తారని అన్నారు. బీజేపీకి ఇవ్వాల్సిన అధికారాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చామని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని బీజేపీ బండి సంజయ్ అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కేడర్‌కు బీజేపీ వ్యతిరేకంగా కాదనీ.. ఆ పార్టీల నాయకులకు మాత్రమే వ్యతిరేకమని బండి సంజయ్ అన్నారు. ఆరు గ్యారెంటీల అలుపై ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. అందరికీ రూ.500 గ్యాస్‌ సిలిండర్, ప్రతి మహిలకు రూ.2,500 ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి వంద ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌కు అభ్యర్థులే లేరని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు చాలా మంది రైతుభరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధివిధానాలు లేకుండా వ్యవహరిస్తోందంటూ బండి సంజయ్ విమర్శలు చేశారు.

Next Story