ఉప్పల్ ఎమ్మెల్యేకు షాక్ : మీ పేరు రాసి చనిపోతాం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2020 5:39 PM ISTహైద్రాబాద్‌లో వరద బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేఫథ్యంలోనే బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని చూసిన బాధిత మహిళలు ఒక్కసారిగా ఫైరయ్యారు.
సుభాష్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ‘మీ పేరు రాసి చనిపోతాం’ అంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న తమను ఎవరూ ఆదుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి తిండిలేక.. ఉండటానికి ఇళ్లు లేకా చిన్న పిల్లలతో నానా అవస్ధలు పడుతున్నామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు వరద బాధితులు. లీడర్లు వస్తున్నారు .. పోతున్నారు కానీ.. ఎలాంటి న్యాయం చేయడం లేదని.. తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు.
Next Story