పలు న్యూస్‌ ఛానళ్లకు టీఆర్పీ రేటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చి కౌన్సిల్‌ (బార్క్‌) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని భాషల్లోని వార్తా ఛానళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మూడు నెలలపాటు రేటింగ్‌లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను సాంకేతిక కమిటీతో సమీక్షించి వాటిని మరింతగా మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. 12 వారాల పాటు వీక్లీ రేటింగ్‌లు ఇచ్చే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రేటింగ్‌ ఏజన్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

తప్పుడు టీఆర్పీలతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ మూడు ఛానెళ్లపై ముంబాయి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే రిపబ్లిక్‌ టీవీ సహా మరో రెండు మరాఠా ఛానళ్లు ఈ మోసాలకు పాల్పడినట్లు ముంబాయి పోలీసు కమిషనర్‌ పరమ్‌వీర్‌సింగ్‌ ఇటీవల తెలిపారు. అలాగే ఈ మోసాలకు పాల్పడిన ఘటనలో ఆయా ఛానళ్లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *