సీఎం జగన్‌తో భేటీ అయిన పరిమళ్ నత్వానీ
By న్యూస్‌మీటర్ తెలుగు
రేపు రాజ్యసభ అభ్యర్థుల పోలింగ్ సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వైసీపీ రాజ్యసభ అభ్యర్ధి పరిమళ్ నత్వానీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను వైసీపీ రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు పరిమళ్ నత్వానీ.. జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖేష్ అంబానీకి సన్నిహితుడైన పరిమళ్ నత్వానీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమంత్రి అమిత్‍షాల సూచనలతో విజయసాయిరెడ్డి మధ్యర్తిత్వం ద్వారా ఆఘమేఘాల మీద పరిమళ్‍తో పాటు ముఖేష్ అంబానీ.. జగన్‍ను కలిసి రాజ్యసభ సీటు దక్కించుకున్నరనే వార్తలు అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో రెండు మూడు రోజుల వరకు ఈ విషయం మీడియా వర్గాలకు కూడా అంతు బట్టలేదు.
ఇదిలావుంటే.. కేంద్రంతో సీఎం జగన్‍కు సత్సంబందాలు ఉన్నాయని పరిమళ్‍ను రాజ్యసభకు ఎంపిక చేయటం బట్టి స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు అప్పట్లో. అలాగే.. జగన్ ఏదో విధంగా కేసుల నుండి బయట పడాలనే ఈ నిర్ణయం తీసుకున్నారనే మరో వాదన కూడా తెలుగు నాట జోరుగా నడిచింది.