జేసీబీతో పెళ్లి మండపం లోకి అడుగు పెట్టాలని అనుకున్నారు.. కానీ ఏమైందంటే..

Couple uses excavator as seat at wedding reception. పెళ్లి సమయాల్లో మండపం లోకి వధూవరులు వచ్చే విషయంలో కొత్త కొత్త పంథాలను ఫాలో

By Medi Samrat  Published on  30 Nov 2021 2:48 PM IST
జేసీబీతో పెళ్లి మండపం లోకి అడుగు పెట్టాలని అనుకున్నారు.. కానీ ఏమైందంటే..

పెళ్లి సమయాల్లో మండపం లోకి వధూవరులు వచ్చే విషయంలో కొత్త కొత్త పంథాలను ఫాలో అవుతూ ఉన్నారు. ఏదైనా కాస్త వెరైటీగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని పలువురు భావిస్తూ ఉన్నారు. అలా జేసీబీ తో ఎంట్రీ ఇవ్వాలని ఓ జంట అనుకుంది. కానీ ఊహించని ఘటన అక్కడ చోటు చేసుకుంది.జేసీబీలను పలు పనులకు వాడుతూ ఉంటారు. త్రవ్వడం దగ్గర నుండి చదును చేయడాలు.. ఇలా చాలా వాటి వాడుతూ ఉండగా.. ఇప్పుడు పెళ్లిళ్లలోనూ వాడుతూ వస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో నూతన వధూవరులు ఎక్స్‌కవేటర్‌పై స్వారీ చేస్తున్నారు. మండపం దగ్గరకు వస్తూ అతిథులను ఆశ్చర్య పరచాలని నిర్ణయించుకున్నారు.

కానీ ఒక్క సారిగా గ్రాండ్ ఎంట్రీ ఇద్దామని అనుకున్న వాళ్లు.. ఓ మోస్తరు ఎత్తు నుండి కింద పడ్డారు.ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న తేదీ లేని చిన్న వీడియోలో, తెల్లటి గౌను ధరించిన వధువు టక్స్‌లో వరుడి పక్కన కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఈ జంట మెరూన్ శాటిన్ క్లాత్‌తో అలంకరించబడిన జేసీబీ బకెట్‌లో కూర్చుని వేలాడుతూ ఉన్నారు. అతిథులకు నమస్కారం చేస్తూ కనిపించారు. అయితే జేసీబీ ఆపరేటర్ అకస్మాత్తుగా బకెట్‌ను కిందకు తిప్పాడు. దీంతో వధూవరులు కిందకు పడిపోయారు. ఏమి తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి వధూవరులకు కొన్ని సెకండ్లు పట్టింది. అతిథులు షాక్‌తో తలలు పట్టుకుని కనిపించారు.


Next Story