న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  10 Oct 2020 11:45 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం

కరోనా మహమ్మారి పుణ్యమా అని అందరి బతుకులు రోడ్డున పడుతున్నాయి. కరోనా సామాన్యుడి నుంచి ప్రభుత్వాల వరకు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ ఉద్యోగాలు చేసే వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చేశారు. ఇంటి నుంచి పనులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్దతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కంపెనీలు శాశ్వతంగా .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.షాకింగ్‌: గంగవ్వను ఇంటికి పంపించిన బిగ్‌బాస్‌.. కారణం అదేనా..?

తెలుగు రాష్ట్రాలలో స్టార్‌ మాలో ప్రారంభమవుతున్న బిగ్‌బాస్‌ షో ఎంతో పాపులారిటీ పొందింది. తాజాగా నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో గంగవ్వకు ప్రత్యేక స్థానం కల్పించారు బిగ్‌బాస్‌. అయితే మళ్లీ గంగవ్వ ఇంటిపై బెంగ పెట్టుకుంది. ఈ మధ్య తన ఆరోగ్యం బాగా లేదని,ఇంటికి వెళ్లిపోతానని చేతులెత్తి వేడుకుంది. కానీ బిగ్‌బాస్‌ ఆమెను పంపించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.Fact Check : నరసారావు పేటలో సరస్వతి విగ్రహం ధ్వంసం ఘటన ఇప్పుడు చోటు చేసుకున్నదేనా..?

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఘటనల కారణంగా తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మరో పోస్టు కూడా వైరల్ అవుతోంది. సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు కొందరు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.ద‌ర్శ‌క ధీరుడిపై కంఫ్లైంట్స్‌.. విషెస్‌లో ఇదో ర‌కం..!

దర్శక బాహుబ‌లి ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన‌రోజు నేడు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం ఆయ‌న‌కు వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు మూవీ టీం ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో రాజ‌మౌళి అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ల ద‌గ్గ‌రి నుండి, కెమెరామెన్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌, మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌, ఆర్ట్ డైర‌క్టెర్‌, హీరోలు, నిర్మాత‌ వ‌ర‌కూ ఆయ‌న సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుండి‌ షూటింగ్ ముగిసేవ‌ర‌కూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు వాయుగుండం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తనున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నట్లు పేర్కొంది. శని, ఆదివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.Fact Check : 200 రూపాయల నోటు మీద శివాజీ మహారాజ్ ఫోటోను ముద్రించారా..?

200 రూపాయల నోటుపై ఇక ఛత్రపతి శివాజీ బొమ్మ ఉండబోతోందనే పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇకపై 200 రూపాయల నోటు మీద ఛత్రపతి శివాజీ బొమ్మను ముద్రిస్తోందని చెబుతూ ఉన్నారు. చాలా మందికి వాట్సప్ లో ఈ మెసేజీ వస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.16 ఏళ్లకే ప్రధాన మంత్రి అయ్యారు

ప్రస్తుతం దేశ ప్రధానులు అయ్యారంటే రాజకీయ రంగంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రత్యేక స్థానం సంపాదించిన తర్వాత ప్రధానులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఓ బాలిక 16 ఏళ్లకే ప్రధాన మంత్రి అయిపోయింది. ఆమె పేరు లావా మూర్తో. టీనేజ్‌ వయసులోనే ‘పర్యావరణాన్ని కాపాడండి.. ప్రకృతిని బతికించండి’ అంటూ రకరకాల క్యాంపెయిన్లలో పాల్గొంటోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.గుడ్‌న్యూస్‌: 5 నిమిషాల ముందు రైలు టికెట్‌ బుకింగ్‌, క్యాన్సిల్‌

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది భారత రైల్వే శాఖ. నిర్ధేశించిన స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరే సమయానికి 5 నిమిషాల ముందు టికెట్‌ను బుక్‌ చేసుకున్నా సీట్లు లభిస్తాయని తెలిపింది. అలాగే ఐదు నిమిషాల ముందు కూడా బుక్‌ చేసుకున్న టికెట్‌ రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విధానం ఈ రోజు నుంచి అమల్లోకి రానుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.మా పిల్ల‌లు ఒలంపిక్స్‌కు రెడీ : న‌మ్ర‌తా

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విష‌యం తెలిసిందే. త‌న భ‌ర్త సినిమాలు, పిల్ల‌ల‌తో టూర్లు త‌దిత‌ర‌ విష‌యాల‌తో పాటు.. ఇంట్లో సంగ‌తుల‌ను కూడా న‌మ్ర‌తా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ వారిని ఉత్సాహ‌ప‌రుస్తుంటుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.తెలంగాణ పోలీసుల ఖాతాలో మరో రికార్డు..ఐదేళ్ల కిందట తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు

పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటి ఏళ్లపాటు కనిపించకుండా తప్పిపోతే వారి బాధ వర్ణానాతీతం. తప్పిపోయిన పిల్లలు కనిపించకపోతే .. ఎలా ఉన్నారో.. ఎక్కడున్నారో.. ఏం తింటున్నారో అన్న బాధ ప్రతినిత్యం వేధిస్తూ ఉంటుంది. అలాంటిది ఐదేళ్ల కిందట తప్పిపోయిన కొడుకు గురించి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధలు ఎలాంటివే చెప్పనక్కలేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story