షాకింగ్‌: గంగవ్వను ఇంటికి పంపించిన బిగ్‌బాస్‌.. కారణం అదేనా..?

By సుభాష్  Published on  10 Oct 2020 11:02 AM GMT
షాకింగ్‌: గంగవ్వను ఇంటికి పంపించిన బిగ్‌బాస్‌.. కారణం అదేనా..?

తెలుగు రాష్ట్రాలలో స్టార్‌ మాలో ప్రారంభమవుతున్న బిగ్‌బాస్‌ షో ఎంతో పాపులారిటీ పొందింది. తాజాగా నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో గంగవ్వకు ప్రత్యేక స్థానం కల్పించారు బిగ్‌బాస్‌. అయితే మళ్లీ గంగవ్వ ఇంటిపై బెంగ పెట్టుకుంది. ఈ మధ్య తన ఆరోగ్యం బాగా లేదని,ఇంటికి వెళ్లిపోతానని చేతులెత్తి వేడుకుంది. కానీ బిగ్‌బాస్‌ ఆమెను పంపించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకు బదులుగా ఆమెకు వైద్యం చేయించి మరికొన్ని రోఓజులు ఇంట్లోనే ఉంచేందుకు ప్రయత్నించారు. ఆమె తిరిగి కోలుకుని ఎప్పటిలాగే హుషారుగా కనిపించడంతో ఇప్పట్లో గంగవ్వ బయటకు వెళ్లదని అందరూ భావించారు.

కాని నిన్నటి ఎపిసోడ్‌లో ఆమెకు మళ్లీ ఇంటిపై బెంగ పెట్టుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండలేకపోతున్నానని చెప్పేసింది. ఇక్కడ ఉంటే కడుపు నిండ తిండి కూడా లోపలికి వెళ్లడం లేదని బోరున విలపించింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అవ్వ బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఆమెను అనారోగ్య కారణాల వల్ల షో నుంచి తప్పించినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.

కాగా, హౌస్‌లో ఏసీ ఉండటం, ఊరి వాతావరణానికి అలవాటు పడిన గంగవ్వ హౌస్‌లో ఇమడలేకపోవడం, అరోగ్య కారణాల వల్ల గంగవ్వ హౌస్‌లో ఉండలేకపోతోంది. అయితే ఆరోగ్యం బాగాలేకపోవడంతోనే ఆమెను బయటకు పంపినట్లు తెలుస్తోంది.

కాగా, ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్లలో డేంజర్‌ జోన్‌లో ఉన్నది అమ్మ రాజశేఖర్‌, సుజాత. సోహేల్‌. మరీ గంగవ్వను ఇంటికి పంపించిన విషయంలో నిజమెంత అని తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

Next Story