16 ఏళ్లకే ప్రధాన మంత్రి అయ్యారు

By సుభాష్  Published on  10 Oct 2020 9:36 AM GMT
16 ఏళ్లకే ప్రధాన మంత్రి అయ్యారు

ప్రస్తుతం దేశ ప్రధానులు అయ్యారంటే రాజకీయ రంగంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రత్యేక స్థానం సంపాదించిన తర్వాత ప్రధానులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఓ బాలిక 16 ఏళ్లకే ప్రధాన మంత్రి అయిపోయింది. ఆమె పేరు లావా మూర్తో. టీనేజ్‌ వయసులోనే 'పర్యావరణాన్ని కాపాడండి.. ప్రకృతిని బతికించండి' అంటూ రకరకాల క్యాంపెయిన్లలో పాల్గొంటోంది. ఎన్నో సందర్భాలలో పర్యావరణానికి సంబంధించిన మానవ హక్కుల అంశాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.

అలా ఉంటూ తాజాగా ఫిన్‌ల్యాండ్‌ ప్రధాన మంత్రి అయిపోయింది. ఎంతో అభివృద్ధి చెందిన ఫిన్‌ల్యాండ్‌లోనూ లింగ వివక్ష చాలా ఉంది. దేశంలో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. అమ్మాయిల పట్ల దేశ ప్రజల్లో పాజిటివ్‌ ఫీలింగ్‌ కలిగించేందుకు ప్రస్తుత మహిళా ప్రధానమంత్రి సనా మార్టిన్‌.. లావా మూర్తోను ఒక రోజు ప్రధానమంత్రిగా ప్రకటించారు. బుధవారం ఒక్క రోజు తన పదవి నుంచి తప్పుకున్న మార్టిన్‌.. ఆ స్థానాన్ని లావా మూర్తోకు అప్పగించారు. అంతే ఆ దేశానికి ఒక రోజు ప్రధాన మంత్రి అయిపోయారు ఆ 16 ఏళ్ల బాలిక. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి డిజిటల్‌ రంగంలో మహిళల హక్కులపై ఏకధాటిగా మాట్లాడింది.

నాలుగేళ్లుగా ఇదో సంప్రదాయం

ఫిన్‌ల్యాండ్‌లో నాలుగేళ్లుగా ఇదో సంప్రదాయంలా మారిపోయింది. 'గర్ల్స్‌ టేకోవర్‌' పేరుతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎవరైతే సమాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారో అలాంటి బాలికలకు ఒక రోజు ప్రధానమంత్రి అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంటారు. ఇలా ప్రధాని అయ్యేవారు ఫిన్‌ల్యాండ్‌ బాలికలో కావాల్సిన పని లేదు. ప్రపంచలో ఎక్కడ నుంచైనా వచ్చి అవవకాశాన్ని దక్కించుకోవచ్చు.

అయితే బాలికలు, మహిళలకు డిజిటల్‌ స్కిల్స్‌, టెక్నాలజీ అవకాశాలను మరింతగా క ల్పించాలన్నది ఈ సంవత్సరం అంశం. కెన్యా, సూఆడన్‌, పెరు, వియత్నాం వంటి దేశాల్లో ఈ దిశగా ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే లావా మూర్తో కూడా ఇదే అంశంపై ప్రసంగించింది.

గత సంవత్సరం ఫిన్‌ల్యాండ్‌ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. 34 ఏళ్ల మార్టిన్‌ ప్రపంచంలో యంగెస్ట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌గా గుర్తింపు పొందారు. టెక్నాలజీ అందరికీ చేరువా కావాలని బలంగా కోరుతున్నారు. ఫిన్‌ల్యాండ్‌లో మార్టిన్‌ మూడో మహిళ ప్రధాని. అయితే డిసెంబర్‌లో ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన మార్టిన్‌ వయసు 34 ఏళ్లు. ప్రపంచంలోనే అతి పిన్న యవస్కురాలిగా గుర్తింపు ఉంది. ఆమె మహిళలచే నాయకత్వం వహించిన ఐదు కేంద్ర, వామపక్ష పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్నారు.



Next Story