మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం

By సుభాష్  Published on  10 Oct 2020 11:26 AM GMT
మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం

కరోనా మహమ్మారి పుణ్యమా అని అందరి బతుకులు రోడ్డున పడుతున్నాయి. కరోనా సామాన్యుడి నుంచి ప్రభుత్వాల వరకు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ ఉద్యోగాలు చేసే వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చేశారు. ఇంటి నుంచి పనులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్దతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కంపెనీలు శాశ్వతంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో దిగ్గజం కంపెనీ మైక్రోసాఫ్ట్ చేరింది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ ఇచ్చేందుకు తెలుస్తోంది. ఉద్యోగులకు తమకు నచ్చితే శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

కరోనా సంక్షేభం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. అమెరికాలోని తన కార్యాలయాలను జనవరి వరకు తెరిచేది లేదని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఒక వేళ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయాలనుకుంటే వాళ్ల కార్యాలయంలో తమ స్థానాన్ని వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా వల్ల కొన్ని కొత్త పద్దతులు తెలిసివచ్చాయని, కొత్త పద్దతుల్లో జీవించడం, పని చేయడం నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌ క్యాథ్లీన్ హోగన్‌ తెలిపారు. వ్యక్తిగత జీవితానికి మద్దతు ఇచ్చేందుకు సహరిస్తామన్నారు. శాశ్వతంగా ఇంటి నుంచే పనులు చేయాలనుకున్నవారు తమ మేనేజర్ల అనుమతి తీసుకోవాలని సంస్థ తెలిపింది. అయితే కొంత మంది ఉద్యోగులు మాత్రం కార్యాలయానికి వచ్చే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. హర్డ్‌వేర్‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణ తీసుకునే ఉద్యోగులు మాత్రం కార్యాలయానికి వచ్యే పనులు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

Next Story