న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  18 Sep 2020 10:09 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.బిగ్‌బాస్‌-4: ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ వార్నింగ్‌.. ఎందుకంటే

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్నాడు. ఇక నాలుగో సీజన్‌ బొదలైన తర్వాత ఆటపాలు, ఏడుపులు పెడబొబ్బలు ఉన్నాయి. పైగా హౌస్‌లో కంటెస్టెంట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో బిగ్‌బాస్‌కు కోపమొచ్చింది. ముఖ్యంగా హౌస్‌లో తెలుగు మాట్లాడటం కంటే ఇంగ్లీష్‌ మాట్లాడటం ఎక్కువైపోయింది. ఇది తెలుగు బిగ్‌బాసా.. లేక ఇంగ్లీష్‌ బిగ్‌బాసా అన్నట్లు ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.ఏపీలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

హిందూ ఆలయాల‌పై దాడుల నేఫ‌థ్యంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఈరోజు ఛలో అమలాపురంకు పిలుపునిచ్చారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేయ‌డంతో పాటు.. ముఖ్య‌ నేత‌లు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా సోము‌ వీర్రాజు మాట్లాడుతూ.. హిందూవాదులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినా.. చలో అమలాపురం ఈరోజు జరిగి తీరుతుందని అన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.కరోనాతో మాదాపూర్‌ ఎస్సై మృతి

దేశంలో కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌ అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తెలంగాణలో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వైరస్‌ బారిన పడి వైద్యులు, పోలీసులు మరణిస్తున్నారు. తాజాగా కరోనా సోకి మాదాపూర్‌ ఎస్సై అబ్బాస్‌ అలీ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలీకి ఇటీవల కరోనా సోకింది..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.సిద్దార్థ్ ఈజ్‌ బ్యాక్‌

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు సిద్దార్థ్‌. గత కొంత కాలంగా ఆయన తెలుగు చిత్రాల్లో నటించలేదు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు సిద్దార్థ్‌. ‘ఆర్ఎక్స్‌ 100’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్‌ భూపతి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి ‘మహాసముద్రం’ అనే టైటిల్ ను ఖారారు చేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సిద్దార్థ్‌ విలన్‌గా నటించనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.బాలిక మిస్సింగ్‌ కేసు విషాదాంతం: సైకిల్‌పై వెళ్లిన బాలిక మృతదేహం లభ్యం

మేడ్చల్‌ జిల్లాలోని నేరెడ్‌మేట్‌ బాలిక మిస్సింగ్‌ కేసు విషాదంతమైంది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక సుమేధ అదృశ్యం కావడంపై మేడ్చల్‌ జిల్లాలో కలకలం రేపింది. నాలాలో గల్లంతైన బాలిక మృతిదేహం బండచెరువులో లభ్యమైంది. దీన్ దయాల్ కాలనీలోని నాలాలో బాలిక సైకిల్ ను గుర్తించిన సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సుమారు మూడు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన బాలిక మృతదేహం.. బండచెరువులో లభ్యమైంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.18 నుంచి మరోసారి జనతా కర్ఫ్యూ

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. అయితే ఈనెల 18 నుంచి మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మరో సారి అక్కడి ప్రజలు కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు మహమ్మారిపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.దోమలు కుడుతున్నాయ్‌.. నిద్ర పట్టడం లేదు

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టై.. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంది నటి సంజన గల్రానీ. ఆమెకు ఆహారం, దుస్తులు అందించేందుకు సంజన తల్లిదండ్రులు గురువారం జైలు వద్దకి వెళ్లారు. అయితే.. జైలు అధికారులు దుస్తులను మాత్రమే తీసుకున్నారు. ఆహారం, పండ్ల రసం, చాక్లెట్లను తీసుకునేందుకు నిరాకరించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.ప్రగతిభవన్‌ వద్ద ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారు. సీఎం క్యాంప్‌ ఆపీస్‌ మెయిన్‌ గేటు దగ్గర ఓ ఆటో డ్రైవర్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అప్రమత్తమై అతడి పై నీళ్లు పోసి రక్షించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.బిగ్‌బాస్‌ -4: గంగవ్వకు అస్వస్థత ..!

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ పొందిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో కొనసాగుతోంది. అయితే 16 మంది కంటెస్టెంట్లలో ఒకరైన మై విలేజ్‌ షో గంగవ్వ ఒకరు. హౌస్‌లో కొనసాగుతున్న గంగవ్వకు వాతావరణం పడటం లేదు. తాజాగా గంగవ్వ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ గంగవ్వను కన్ఫెక్షన్‌ రూమ్‌కు పిలిపించి నీ ఆరోగ్యం గురించి బెంగ పడొద్దు. మీరు త్వరగా కోలుకుంటారు అని చెప్పారు. నన్ను బాగా చూసుకుంటున్నారు.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకు వాతావరణం పడటం లేదు అంటూ గంగవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు తండ్రి, భర్త అంటూ ఎవరు లేరు అంటూ ఏడ్చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 96,424 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1174 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడింది. దీంతో దేశంలో పాజిటివ్‌ కేసులు సంఖ్య 52,14,678కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 41,12,522 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 10,17,754 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 84,372 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.64శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story