బిగ్‌బాస్‌ -4: గంగవ్వకు అస్వస్థత ..!

By సుభాష్  Published on  18 Sep 2020 3:06 AM GMT
బిగ్‌బాస్‌ -4: గంగవ్వకు అస్వస్థత  ..!

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ పొందిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో కొనసాగుతోంది. అయితే 16 మంది కంటెస్టెంట్లలో ఒకరైన మై విలేజ్‌ షో గంగవ్వ ఒకరు. హౌస్‌లో కొనసాగుతున్న గంగవ్వకు వాతావరణం పడటం లేదు. తాజాగా గంగవ్వ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ గంగవ్వను కన్ఫెక్షన్‌ రూమ్‌కు పిలిపించి నీ ఆరోగ్యం గురించి బెంగ పడొద్దు. మీరు త్వరగా కోలుకుంటారు అని చెప్పారు. నన్ను బాగా చూసుకుంటున్నారు.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకు వాతావరణం పడటం లేదు అంటూ గంగవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు తండ్రి, భర్త అంటూ ఎవరు లేరు అంటూ ఏడ్చేసింది. దాంతో మీ ఆరోగ్యం విషయంలో ఎలాంటి టెన్షన్‌ పడొద్దని, మీ ఆరోగ్యం గురించి వైద్యులు చూసుకుంటారు అని బిగ్‌బాస్‌ భరోసా ఇచ్చారు. అయితే టెక్నీషియన్లకు కరోనా సోకిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా గంగవ్వకు కూడా కోవిడ్‌ పరీక్షలు చేయించారట. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది. కాగా, హౌస్‌లో ఉండలేకపోతున్న గంగవ్వను బిగ్‌బాస్‌ నిర్వహకులే ఓ అడుగు ముందుకేసి ఆమెను త్వరలో బయటకు పంపేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా మరింత కలకలం రేపుతోంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ షో కోసం పని చేస్తున్న సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. దానికి తోడు అందులో ఉన్న కంటెస్టెంట్లకు కూడా కరోనా పరీక్షలు చేయించుకుని 16 రోజుల క్వారంటైన్‌ తర్వాత మళ్లీ నెగిటివ్‌ రావడంతో ఇంట్లోకి వెళ్లారు. పైగా ఈ సీజన్‌ కోసం పని చేస్తున్న సిబ్బంది సంఖ్య కూడా సగానికి సగం తగ్గించినట్లు తెలుస్తోంది.

డాక్టర్లు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటారు

హౌస్‌లో గంగవ్వకు కళ్ల నొప్పులు, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం.. ఇలా కాస్త అస్వస్థకు గురికావడంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు వైద్యుని వద్దకు పంపి గంగ్వకు ధైర్యం చెప్పారు. మీరు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, మీరు సమయానికి మందులు వేసుకోండి.. డాక్టర్లు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటారు. మీరు గట్టి మనిషి.. మీ గురించి బాగ్‌బాస్‌కు బాగా తెలుసు. ఎలాంటి టెన్షన్‌ పడకండి అంటూ బిగ్‌బాస్‌ చెప్పడంతో మీరు చెప్పినట్లే నేను గట్టి మనిషిని అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది.

Next Story