ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే మీడియాలో ప్రసారం చేయకుండా సమాచార శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. జస్టిస్‌ చావ్లా ధర్మాసనం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మీడియాలో ప్రసారాలపై సుప్రీంకోర్టు కూడా స్పందించిందని కోర్టు వ్యాఖ్యనించింది.

కాగా, ప్రముఖ నటుడు సుశాంత్‌ అనుమానస్పద మృతి కేసును పోలీసులు డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె రకూల్‌, సారా అలీఖాన్‌ల పేర్లను వెల్లడించినట్లు ఇటీవల ఎన్‌సీబీ వెల్లడించింది. ఈ క్రమంలో రకూల్‌ గురించి ప్రసార మాధ్యమాల్లో కథనాలు వెలువడ్డాయి. సోషల్‌ మీడియాలో సైతం రకూల్‌కు వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంశంపై రకూల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *