హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారు. సీఎం క్యాంప్‌ ఆపీస్‌ మెయిన్‌ గేటు దగ్గర ఓ ఆటో డ్రైవర్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అప్రమత్తమై అతడి పై నీళ్లు పోసి రక్షించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని.. 2010లో అసెంబ్లీ గేటు ముందు ఆత్మహత్యాయత్నం చేశానని బాధితుడు వాపోయాడు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా తన కష్టాలు తీరలేదన్నాడు. ప్రభుత్వం ఇప్పటి వరకు తనకు ఇల్లు కూడా మంజూరు చేయలేదంటూ నినాదాలు చేశాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.