మరో మూడు రోజులు భాగ్యనగరంలో భారీ వర్షాలు.. నిన్న ఎక్కడ ఎంత వర్షపాతమంటే

By సుభాష్  Published on  18 Sep 2020 5:03 AM GMT
మరో మూడు రోజులు భాగ్యనగరంలో భారీ వర్షాలు.. నిన్న ఎక్కడ ఎంత వర్షపాతమంటే

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి ఉపరితల ద్రోణితో రెండు రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కురిసిన భారీ వర్షానికి నగరమంతా తడిసిముద్దైంది. ఇక గురువారం మళ్లీ అదే రీతిలో జోరు వర్షంతో నగరమంతా జలమయమయ్యింది. మదాపూర్‌లో అత్యల్పంగా 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ఠం 21.6 డిగ్రీల సెల్సియల్‌,గాలిలోతేమ 97 శాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నగరంలో ఎక్కడ ఎంత వర్షపాతం

ప్రాంతం పేరువర్షపాతం సెం.మీలలో
బాలానగర్‌7.1
మల్కాజిగిరి5.4
మూసాపేట4.9
పెద్ద అంబర్‌పేట్‌4.9
పాత బోయిన్‌పల్లి4.8
బేగంపేట్‌4.0
మారేడ్‌పల్లి3.6
హయత్‌నగర్‌2.6
గచ్చిబౌతి, శేరిలింగంపల్లి2.5
వెస్ట్‌ మారేడ్‌పల్లి2.4
అమీర్‌పేట్‌2.4
జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌2.1
శ్రీనగర్‌ కాలనీ, అల్వాల్‌2.0
యూసఫ్‌గూడ1.9
రామచంద్రపురం1.7
తిరులగిరి, కాప్రా1.5
మోండామార్కెట్‌1.4
టోలిచౌక్‌1.3
కార్వాన్‌1.2
మాదాపూర్‌1.0

Next Story