మరో మూడు రోజులు భాగ్యనగరంలో భారీ వర్షాలు.. నిన్న ఎక్కడ ఎంత వర్షపాతమంటే
By సుభాష్Published on : 18 Sept 2020 10:33 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి ఉపరితల ద్రోణితో రెండు రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కురిసిన భారీ వర్షానికి నగరమంతా తడిసిముద్దైంది. ఇక గురువారం మళ్లీ అదే రీతిలో జోరు వర్షంతో నగరమంతా జలమయమయ్యింది. మదాపూర్‌లో అత్యల్పంగా 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠం 21.6 డిగ్రీల సెల్సియల్,గాలిలోతేమ 97 శాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నగరంలో ఎక్కడ ఎంత వర్షపాతం
| ప్రాంతం పేరు | వర్షపాతం సెం.మీలలో |
| బాలానగర్ | 7.1 |
| మల్కాజిగిరి | 5.4 |
| మూసాపేట | 4.9 |
| పెద్ద అంబర్‌పేట్ | 4.9 |
| పాత బోయిన్‌పల్లి | 4.8 |
| బేగంపేట్ | 4.0 |
| మారేడ్‌పల్లి | 3.6 |
| హయత్‌నగర్ | 2.6 |
| గచ్చిబౌతి, శేరిలింగంపల్లి | 2.5 |
| వెస్ట్ మారేడ్‌పల్లి | 2.4 |
| అమీర్‌పేట్ | 2.4 |
| జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ | 2.1 |
| శ్రీనగర్ కాలనీ, అల్వాల్ | 2.0 |
| యూసఫ్‌గూడ | 1.9 |
| రామచంద్రపురం | 1.7 |
| తిరులగిరి, కాప్రా | 1.5 |
| మోండామార్కెట్ | 1.4 |
| టోలిచౌక్ | 1.3 |
| కార్వాన్ | 1.2 |
| మాదాపూర్ | 1.0 |
Next Story