బిగ్‌బాస్‌-4: ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ వార్నింగ్‌.. ఎందుకంటే

By సుభాష్  Published on  18 Sep 2020 9:39 AM GMT
బిగ్‌బాస్‌-4: ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ వార్నింగ్‌.. ఎందుకంటే

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో నాలుగో సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్నాడు. ఇక నాలుగో సీజన్‌ బొదలైన తర్వాత ఆటపాలు, ఏడుపులు పెడబొబ్బలు ఉన్నాయి. పైగా హౌస్‌లో కంటెస్టెంట్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో బిగ్‌బాస్‌కు కోపమొచ్చింది. ముఖ్యంగా హౌస్‌లో తెలుగు మాట్లాడటం కంటే ఇంగ్లీష్‌ మాట్లాడటం ఎక్కువైపోయింది. ఇది తెలుగు బిగ్‌బాసా.. లేక ఇంగ్లీష్‌ బిగ్‌బాసా అన్నట్లు ఉంది.

ఇలాంటి సమయంలో బిగ్‌బాస్‌ కూడా సీరియస్‌ అయ్యాడు. ఈ సీజన్‌ తొలిసారి అందరికి శిక్ష వేశాడు. గంగవ్వ మినహా అందరితోనూ గుంజీలు తీయించాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అలాంటి శిక్షలు అమలు అవుతూ ఉంటాయని చెప్పాడు బిగ్‌బాస్‌. ఏ ఒక్కరు కూడా ఇంటి నియమాలు పాటించడం లేదని, ఎవరికి నచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారంటూ బిగ్‌బాస్‌ సీరియస్‌ అయ్యాడు. అందేకు ఈ శిక్ష తప్పదని చెప్పాడు. దీనికి సంబంధించిన ప్రమోగా తెగ వైరల్‌ అవుతోంది. అలాగే బిగ్‌బాస్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేసిన కంటెస్టెంట్లు అంటూ నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. మరీ ఇంటి సభ్యులకు గుంజీలే కాకుండా ఇంకా ఎలాంటి శిక్షలు వేశాడో చూడాలి.

Next Story