సిద్దార్థ్ ఈజ్‌ బ్యాక్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2020 8:05 AM GMT
సిద్దార్థ్ ఈజ్‌ బ్యాక్‌

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' వంటి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు సిద్దార్థ్‌. గత కొంత కాలంగా ఆయన తెలుగు చిత్రాల్లో నటించలేదు. దాదాపు ఏడేళ్ల విరామం తరువాత మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు సిద్దార్థ్‌. 'ఆర్ఎక్స్‌ 100' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్‌ భూపతి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి 'మహాసముద్రం' అనే టైటిల్ ను ఖారారు చేశారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సిద్దార్థ్‌ విలన్‌గా నటించనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా దీనిపై చిత్ర బృందం క్లారిటి ఇచ్చింది. ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్ నటించనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. "సిద్ధార్థ్ కు సంబంధించి వీడియోను పోస్ట్ చేసింది. సముద్రమంత టాలెంట్‌ కలిగి, మరొక్కసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న సిద్దార్థ్‌కు మహాసముద్రం టీం స్వాగతం పలుకుతోంది" అని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.Next Story