మరో కొత్త సర్ ప్రైజ్ కథతో నిఖిల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Oct 2020 6:35 PM IST
యంగ్ హీరో నిఖిల్ మంచి జోరు మీదున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను సాధిస్తున్నాడు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ హిట్‌లు పొందుతుంటాడు. 'అర్జున్ సురవరం' సినిమాతో హిట్ అందుకున్ననిఖిల్.. ఆ తర్వాత రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. వాటిలో ఒకటి 'కార్తికేయ 2' కాగా రెండోది '18 పేజెస్' సినిమా.
నిఖిల్ కేరీర్ లోనే అత్యంత వినూత్న కథాంశంతో ‘18 పేజెస్’ అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుందని టాక్. ఈ సినిమా కథలో హీరో మెమొరీ లాస్ సమస్యతో బాధపడుతూ ఉంటాడని తెలిసింది. ఈ పాత్రను నిఖిల్ చాలెంజ్ గా తీసుకొని బాగా కనిపించబోతున్నాడని.. మూవీ థీమ్ కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని సమాచారం. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తో ఆగిన మూవీ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇదలా ఉంటే.. ఈ మూవీలో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కన్ఫర్మ్ అయ్యారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనిపై స్పందించిన అనుపమ.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని ట్విట్టర్‌లో కామెంట్ పెట్టారు. నిఖిల్ మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2లో నటించనున్నారు. ఇందులోనూ హీరోయిన్‌గా అనుపమ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ఈ జంట కనువిందు చేయనున్నారు.