న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 4 Jan 2020 10:03 PM IST1.రిటైర్మెంట్ ప్రకటించిన స్వింగ్ కింగ్..!
టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్ని ఫార్మాట్లకు సెలవు చెప్తూ శనివారం నాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఇర్ఫాన్ నిర్ణయం క్రికెట్ అబిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన ఇర్ఫాన్ పఠాన్.. కపిల్ దేవ్ తర్వాత అంతటి ప్రమాదకర స్వింగ్, సీమ్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
2. ‘రాములమ్మ’ సినిమాల్లో నటించాలంటే రెండు కండీషన్లు.!
నేటి భారతం’, ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ ఉత్తమ నటి, లేడీ అమితాబ్ విజయశాంతి. సూపర్‌స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో భారతి పాత్రతో అద్భుతమైన రీఎంట్రీ ఇస్తున్నారు. లేడి సూపర్‌స్టార్‌గా పేరున్న విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. సూపర్‌స్టార్ మహేష్ నటించిన.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
3. కేసీఆర్, ఓవైసీలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ‘ఎంపీ అరవింద్’
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గడ్డంలేని వ్యక్తిగా అభివర్ణించారు. అసద్ గడ్డం కోసి కేసీఆర్‌కు అతికిస్తానని, అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన సీఏఏ అవగాహన సదస్సులో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ఓట్ల కోసమే పౌరసత్వ చట్టాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
4.సెక్స్ రాకెట్ నడిపిన గోల్డ్ మెడల్ స్టూడెంట్
గత కొన్నేళ్లుగా గుంటూరులో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒక యువకుడు అద్దెకు తీసుకున్న ఇంటిలో ఒక మహిళ, ఆ మహిళ కోసం తరచూ కొంతమంది వ్యక్తులు వచ్చి వెళ్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి విషయం చెప్పగా..పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు చేయడంతో వ్యభిచారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
5. జేసీపై కేసు.. నిర్బంధం.. పుట్లూరులో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు నిర్బంధించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు జేసీని నిర్భందించారు. జేసీపై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
6. హైదరాబాద్ : సీఏఏకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి దళిత విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలతో కూడిన జేఏసీ మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నాయి. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయిన మిలియన్ మార్చ్ ర్యాలీ కొనసాగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
7.బాలికను డ్రగ్స్‌కు బానిసగా మార్చిన కామాంధులు..ఆరు నెలలుగా రోజూ..
పదమూడు సంవత్సరాల మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టారు ఈ కామాంధులు. ఐదుగురు యువకులు కలిసి తమతో రోజు సెక్స్‌లో పాల్గొనాలంటూ ఈ మైనార్ బాలికకు డ్రగ్స్ ఇచ్చి బానిసగా మార్చేసిన వైనం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగు చూసింది. మాదకద్రవ్యాలకు బానిసైన ఆ బాలికపై రోజు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.
8.నింద నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే ఆర్కే..
వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే టీడీపీ నేత బొండా ఉమాకు సవాల్ విసిరారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ..రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో తన భార్య పేరిట 5 ఎకరాల భూమి ఉందని నిరూపిస్తే..శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అలా నిరూపిస్తే వెంటనే నిరూపించిన వారికే ఆ భూమిని రిజిస్ర్టేషన్ చేయించి ఇస్తానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
9.ముషారఫ్‌కు ఉరిశిక్ష పడేనా..?
పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కు ఇటీవల ఇస్లామాబాద్ స్పెషల్ కోర్టు ఉరి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని దేశ ద్రోహం కింద కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ జరిపిన స్పెషల్ కోర్టు దోషిగా తేలుస్తూ ఈ శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముషారఫ్ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
10. హిట్‌మ్యాన్‌కు విశ్రాంతి.. ఆ రికార్డ్ ఇక కోహ్లీదే..!
ఆదివారం నుండి శ్రీలంకతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. 2019 డిసెంబర్‌లో విండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది మొదలయ్యే మొదటి సిరీస్‌లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలని చూస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…