బాలిక‌ను డ్ర‌గ్స్‌కు బానిస‌గా మార్చిన కామాంధులు..ఆరు నెలలుగా రోజూ..

ప‌ద‌మూడు సంవ‌త్స‌రాల మైన‌ర్ బాలిక‌పై దారుణానికి ఒడిగ‌ట్టారు ఈ కామాంధులు. ఐదుగురు యువ‌కులు క‌లిసి త‌మ‌తో రోజు సెక్స్‌లో పాల్గొనాలంటూ ఈ మైనార్ బాలిక‌కు డ్ర‌గ్స్ ఇచ్చి బానిస‌గా మార్చేసిన వైనం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో వెలుగు చూసింది. మాద‌క‌ద్ర‌వ్యాల‌కు బానిసైన ఆ బాలికపై రోజు అత్యాచారానికి పాల్ప‌డుతున్నారు. ఈ మేర‌కు బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. భోపాల్‌కు చెందిన 13 ఏళ్ల మైన‌ర్ బాలిక‌కు త‌ల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి ఆటో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. దీంతో బాలిక నానమ్మ వద్ద ఉంటోంది. 6 నెలల క్రితం బాలికకు ఓ యువకుడు గంజాయితో కూడిన సిగరెట్ అలవాటు చేశాడు. అప్పటి నుంచి ఆమె మత్తుకు బానిసగా మారింది. ఈ కామంధులు డ్ర‌గ్స్ ఇవ్వ‌డంతో బాలిక ఎంత‌కైనా దిగ‌జారేలా మారిపోయింది. డ్ర‌గ్స్ కు బానిసైన బాలిక‌కు మ‌ళ్లీ డ్ర‌గ్స్ ఇవ్వాలంటే త‌మ‌తో సెక్స్‌లోపాల్గొనాల‌ని చెప్పారు. ఇలా ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఐదుగురు యువ‌కులు రోజు బాలిక‌పై అత్యాచారం కొన‌సాగించారు.

కొన్ని రోజుల త‌ర్వా మ‌న‌వ‌రాలి ప్ర‌వ‌ర్త‌న‌లో తేడా క‌నిపించ‌డంతో నాన‌మ్మ‌కు ఏదో అనుమానం వ‌చ్చింది. వెంట‌నే ఆమె బాల‌ల సంర‌క్ష‌ణ కేంద్రానికి స‌మాచారం అందించింది. స‌మాచారం అందుకున్న అధికారులు బాలిక‌ను విచారించ‌డంతో అస‌లు విష‌యం బయ‌ట‌కు వ‌చ్చింది. గ‌త ఆరు నెల‌లుగా ఆ యువ‌కులు బాలిక‌పై ఈ దారుణానికి పాల్ప‌డుతున్న‌ట్లు విచార‌ణలో తేలింది. దీంతో చైల్డ్‌లైన్ సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.