హిట్‌మ్యాన్‌కు విశ్రాంతి.. ఆ రికార్డ్ ఇక కోహ్లీదే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jan 2020 9:12 AM GMTఆదివారం నుండి శ్రీలంకతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. 2019 డిసెంబర్‌లో విండీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది మొదలయ్యే మొదటి సిరీస్‌లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలని చూస్తోంది.
అయితే.. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ సిరీస్‌లో ఓ రికార్డు ఊరిస్తోంది. విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ టీ20 పరుగుల్లో టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 2,633 పరుగులతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌ను కోహ్లీ దాటేసే అవకాశం ఉంది.
శ్రీలంకతో సిరీస్‌కు సెలక్టర్లు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోనున్నాడు. కేవలం పరుగు చేస్తే రోహిత్‌ను అధిగమించే కోహ్లీ.. ఈ సిరీస్‌లో రాణిస్తే హిట్ మ్యాన్‌కు అందనంత దూరంలో నిలుస్తాడు. రోహిత్ చాలా దూరంలో ఉన్న కోహ్లీ విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో 50 బంతుల్లో 94 పరుగులు.. మూడో టీ20లో 29 బంతుల్లో అజేయంగా 70 పరుగులు సాధించి తనతో సమంగా నిలిచాడు.