సెక్స్ రాకెట్ నడిపిన గోల్డ్ మెడల్ స్టూడెంట్

By రాణి  Published on  4 Jan 2020 10:49 AM GMT
సెక్స్ రాకెట్ నడిపిన గోల్డ్ మెడల్ స్టూడెంట్

ముఖ్యాంశాలు

  • గుంటూరు హైటెక్ వ్యభిచారం
  • స్థానికుల సమాచారంతో దాడి చేసిన పోలీసులు
  • స్టూడెంట్ సెక్స్ రాకెట్ ను చూసి విస్తుపోయిన పోలీసులు
  • బీటెక్ స్టూడెంట్స్, ఒక మహిళ అరెస్ట్

గత కొన్నేళ్లుగా గుంటూరులో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒక యువకుడు అద్దెకు తీసుకున్న ఇంటిలో ఒక మహిళ, ఆ మహిళ కోసం తరచూ కొంతమంది వ్యక్తులు వచ్చి వెళ్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి విషయం చెప్పగా..పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు చేయడంతో వ్యభిచారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడున్న ఇద్దరు వ్యభిచార నిర్వాహకుల్లో ఒకరు బీటెక్ విద్యార్థి నిడిగొండ వీరబ్రహ్మం కావడం పోలీసులను విస్తుపోయేలా చేసేంది. ఒక స్టూడెంట్ కేవలం సంపాదన కోసం సెక్స్ రాకెట్ ను నడుపుతుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.

వీరబ్రహ్మం ఆన్ లైన్ లో ఒక యాప్ ను రూపొందించి అందులో యువతుల పేర్లతో తన మొబైల్ నెంబర్ ఇచ్చి విటులను ఆకట్టుకుంటూ వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఈస్ట్ డీఎస్పీ సుప్రజ తెలిపారు. నిందితులు నిడిగొండ వీరబ్రహ్మం, ఉప్పల థామస్ కుమార్, భూపతి నాగేశ్వరరావు, నల్లపాటి అశోక్ కుమార్ లను మీడియా ఎదుట హాజరుపరిచారు.

సెక్స్ వృత్తిలోకి ఇలా..

ఈస్ట్ డీఎస్పీ సుప్రజ తెలిపిన వివరాల ప్రకారం '' మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన వీరబ్రహ్మంకు మూడేళ్ల వయసున్నప్పుడే అతని తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో మృతి చెందడంతో అమ్మమ్మ కూలిపనులు చేస్తూ అతడిని చదివిస్తోంది. 5వ తరగతి వరకూ గ్రామంలోనే చదివిన బ్రహ్మం 6-10 వరకూ ప్రభుత్వ హాస్టల్ లో ఉండి స్కూల్ చదువును పూర్తిచేశాడు. ఆ తర్వాత పాలిసెట్ రాసి ర్యాంక్ సాధించి పాలిటెక్నిక్ చదివాడు. పాలిటెక్నిక్ లో గోల్డ్ మెడల్ సాధించిన వీరబ్రహ్మం ఈ సెట్ లో 2వేల ర్యాంక్ సాధించి గుంటూరులో ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ లో చేరాడు. ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్న అతను..ఒకసారి ఆన్ లైన్ యాప్ ద్వారా కాల్ గాళ్స్ కోసం సెర్చ్ చేశాడు. అందులో రవి అనే వ్యక్తి బ్రహ్మానికి పరిచయం అయి రూ.30 వేలు తీసుకుని హైదరాబాద్ కు రావాలని చెప్పి ఒక అడ్రస్ ఇచ్చారు. రవి చెప్పిన అడ్రస్ కు వెళ్లి చూడగా..అక్కడ ఎవరూ లేరు. పైగా తనకు ఇచ్చిన నెంబర్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ విషయంపై రవి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా..పెద్దగా స్పందన లేదు. తాను మోసపోయానని గ్రహించిన వీరబ్రహ్మం...డబ్బుల కోసం తాను కూడా ఇలాగే మోసం చేయవచ్చని భావించి ఆన్ లైన్ వెబ్ సైట్ లో తన నెంబర్ కూడా పెట్టాడు.

అలా వెబ్ సైట్ ద్వారా తనకు వచ్చిన నంబర్ల ద్వారా పలువురు యువతులతో మాట్లాడిన వీరబ్రహ్మం వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. సుమారు రెండేళ్లుగా వీరబ్రహ్మం సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో వీర బ్రహ్మంకు ఇద్దరు పిల్లల తల్లి పరిచయమైంది. ఆమెతో సహజీవనం చేస్తూ వారి పోషణ కూడా తానే చూస్తున్నాడు. అదే సమయంలో థామస్‌ కుమార్‌ కూడా ఈ విధంగానే వీరబ్రహ్మంకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి పాతగుంటూరులోని నంది వెలుగు రోడ్డులో గది అద్దెకు తీసుకుని సెక్స్ దందా సాగిస్తున్నారు. తరచూ ఆ గదికి ఎవరెవరో మహిళలు, యువకులు వచ్చి వెళ్తుండటంతో అనుమానించిన స్థానికులు డయల్ 100కు సమాచారమిచ్చారని, ఆ సమాచారంతో పోలీసులు దాడి చేయగా..ఒక మహిళ , నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు డీఎస్పీ సుప్రజ. వీరబ్రహ్మం వలలో తెలుగు రాష్ర్టాలకు చెందిన మహిళలు, యువతులతో పాటు కళాశాల విద్యార్థినులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story
Share it