న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 25 Dec 2019 9:56 PM IST1.అందరూ చేయి చేయి కలిపి నడిస్తేనే అది భారతీయత..!
జాతి సంతోషం కోసం ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ఏకమవ్వాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపుఇచ్చారు. హైద్రాబాద్ నగరంలోని సరూర్‌నగర్ స్టేడియంలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ తలపెట్టిన విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ సమానులేనని.. అంతా చేయిచేయి కలిపి నడిస్తేనే అది భారతీయత అవుతుందన్నారు. అటువంటి స్వభావం మన మట్టిలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
2. జనాభా లెక్కలు జాతీయ జనాభా జాబితా ఏమిటి? ఎందుకు?ఎలా?
క్యాలెండర్ లో పేజీ మరలిపోగానే కొత్త సంవత్సరం వస్తుంది. 2019 గతమై, 2020 మొదలవుతుంది. 2020 లో కేంద్ర ప్రభుత్వం రెండు పెద్ద కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. మొదటిది 2021 లో జరగనున్న జనాభా లెక్కల ముందస్తు తయారీలో భాగంగా దేశ వ్యాప్తంగా ఇంటి చిరునామాల సర్వే జరుగుతుంది. రెండవది జాతీయ జనాభా రిజిస్టర్. దీనిని కూడా దేశ వ్యాప్తంగా చేపట్టనున్నారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం 3941.35 కోట్ల రూపాయలను కేటాయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
3. అసమాన దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ‘అటల్ జీ’
అసమాన దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అటల్ బిహారీ వాజపేయ్. రాజకీయాల్లో వికసించిన కమలం లాంటి వ్యక్తి ఆయన. ఎన్నోపదవులు చేపట్టి రాజకీయ నేతల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో రచనలు, ఎన్నో పదవులు, ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా నిలిచాడు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చిన వ్యక్తి ఆయన. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
4. జాతీయ అవార్డ్ చిత్రంతో రాబోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ !
‘కేరాఫ్ కంచెర పాలెం’ అనే అతి చిన్న సినిమాతో ఇటు ప్రేక్షకులతో పాటు అటు సినీ ప్రముఖుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా. సురేష్ ప్రొడక్షన్స్ పై ‘రానా దగ్గుబాటి’ సమర్పించిన ఈ సినిమా ఇప్పటికే అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అలాగే ఇటివలే ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్’లో కూడా ప్రదర్శింపబడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
5. 2019లో అంతరిక్షంలో జరిగిన అద్భుతాలివే..!
ఇక 2019 సంవత్సరం ముగియబోతోంది. ఇక అంతరిక్ష అంశాలకు సంబంధించి ఈ ఏడాది విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో అంతరిక్షంలో అద్భుతమైన విశేషాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. 1954 అక్టోబర్ లో మొదటి శైటిలైట్ స్పుత్నిక్ -1 అంతరిక్షంలో విహరించింది. ఆ తర్వాత 1961లో యూరీ గగారిన్ అంతరిక్షంలోకి ప్రయాణం చేసిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించింది. అలాగే 1969లో చందమామపై కాలు మోపడం ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
6. 2019లో సినీ లోకాన్ని విడిచి వెళ్లిన తారలు వీరే..
టాలీవుడ్‌లో ఎందరో తమ తమ నటన ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రముఖల మరణం సినీ ఇండస్ట్రీలో తీరని లోటుగా మిగిలింది. ఇక టాలీవుడ్‌లో మనల్ని విడిచి దూరమైన వారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
7. యుఎస్ఎ క్రికెట్ డైరెక్టర్ల బోర్డులో తెలుగు తేజం
ఖండాంతరాలు దాటిపోయినా క్రికెట్ మీదున్న మమకారం చావలేదు. సమున్నత స్థాయికి చేరుకుంటున్న కొద్దీ దానిపై మరింత మక్కువ పెరుగుతూ వచ్చిందే తప్ప తరగలేదు. తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి, ఉన్నతస్థాయి ఉద్యోగంకోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఓ యువకుడికి తనకు నచ్చిన, తాను మెచ్చిన క్రీడకు సేవలందించే సమున్నతమైన స్థానం దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
8. ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. వివరాళ్లోకెళితే.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్ అనే ఆటోడ్రైవర్ హిజ్రాపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. మంగళవారం రాత్రి తన ఆటో ఎక్కిన ఆ ట్రాన్స్‌జెండర్‌పై ఆటో డ్రైవర్ ఈ దారుణానికి యత్నించినట్లు తెలుస్తోంది. ఆటోడ్రైవర్ బారి నుంచి తప్పించుకున్న ట్రాన్స్‌జెండర్ ఇతర హిజ్రాలకు జరిగిన విషయం తెలియజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
9. ఈ వయసులో ఆ ఇద్దరికీ పెళ్ళా…?
ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా ఆఖరి రోజుల్లో ఒక తోడు అవసరం. జీవితభాగస్వామి లేని లోటు చివరి రోజుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరిపోయిన తర్వాత ఒంటరిగా జీవించాలంటే బతుకు చాలా దుర్భరంగా ఉంటుంది. వయసుడిగిన ఒగ్గులు కనీసం తమకు ఒక తోడు ఉంటే బాగుండని భావిస్తారు. మందోమాకో వేసుకోమని గుర్తు చేయడానికి, సమయానికి పట్టెడన్నం తినమని అడగడానికి, నీకు నేనున్నానంటూ ధైర్యాన్ని అందించడానికి ఆ తోడు చాలా అవసరం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
10.. ఎన్‌పీఆర్‌కు, ఎన్‌ఆర్సీకి తేడా లేదు.. అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఎన్‌పీఆర్‌కు, ఎన్‌ఆర్సీకి తేడా లేదని ఎమ్‌ఐమ్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మత ప్రాతిపదికన మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ముస్లిం యునైటెడ్ కమిటీ నాయకులు భేటీ అయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, పాషా ఖాద్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…