2019లో అంతరిక్షంలో జరిగిన అద్భుతాలివే..!

By సుభాష్  Published on  25 Dec 2019 10:06 AM GMT
2019లో అంతరిక్షంలో జరిగిన అద్భుతాలివే..!

ఇక 2019 సంవత్సరం ముగియబోతోంది. ఇక అంతరిక్ష అంశాలకు సంబంధించి ఈ ఏడాది విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో అంతరిక్షంలో అద్భుతమైన విశేషాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. 1954 అక్టోబర్ లో మొదటి శైటిలైట్ స్పుత్నిక్ -1 అంతరిక్షంలో విహరించింది. ఆ తర్వాత 1961లో యూరీ గగారిన్ అంతరిక్షంలోకి ప్రయాణం చేసిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించింది. అలాగే 1969లో చందమామపై కాలు మోపడం ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదే విధంగానే ఈ 2019 సంవత్సరంలో కూడా అద్భుతాలే జరిగాయని చెప్పాలి. మరి అవేంటో ఓసారి చూసేద్దాం..

జనవరి – 2019

ఇదే సంవత్సరంలో నాసాకు చెందిన న్యూ హారిజన్స్ స్సేస్ క్రాప్ట్ అల్జిమా థులే వరకు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువ దూరంలో ఉన్న శకలాన్ని చేరుకోవడం ఇదే తొలిసారట. అలాగే ఇదే నెలలోనే చైనా తన చాంగే -4 ల్యాండర్ ను చందమామ అవతలి వైపున ల్యాండ్ చేసింది

ఫిబ్రవరి :

'నాసా' అరుణగ్రహంపై తవ్వకాలు జరిపింది. ఐదు మీటర్ల లోతు తవ్వాలను భావించి ఈ మిషన 30 సెంటీమీటరర్లు తవ్విన తర్వాత మిషన్‌ లో సమస్య ఏర్పడి పాడైపోయింది. ఇదే నెలలో ఇజ్రాయేల్ కు చెందిన స్పేస్ ఐఎల్ కంపెనీ తన మొదటి మూన్‌ ల్యాండర్ రాకెట్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి 19న చందమామా సూపర్ మూన్ గా కనిపించింది. ఇదే నెలలో జూనో ఆర్బిటర్ గురు గ్రహానికి సంబంధించి అద్భుతమైన ఫోటోలు చిత్రీకరించింది.

మార్చి :

స్పేస్ ఎక్స్ సంస్థ తమ డ్రాగన్ 2 క్రాప్ట్ ను పరీక్షించగా, అది అంతరిక్ష కేంద్రానికి చేరి విజయవంతమైంది.

ఏప్రీల్

నాసాకు చెందిన పార్కర్ సోలార్ పూబ్ దాదాపు సూర్యుని వద్దకు చేరింది. ఇప్పటి వరకు అంత దగ్గరగా ఏది వెళ్లలేదు. స్పేస్ ఎక్స్ మరో ఫాల్కన్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.

మే :

ఇటా అక్వారిడ్ ఉల్కపాతం మే నెలలో కనిపించింది. హేలీ తోక చుక్క నుంచి భూమిపైకి వస్తున్నవే ఈ ఉల్కలు. చంద్రునిపై 15 మీటర్ల వెడల్పు ఉన్న ఓ తాజా వ్యోమగాములుగా గుర్తించారు.

జూన్

నాసాకి చెందిన మార్సు రికొన్నై సాన్స్ ఆర్బిటర్, మార్స్ కి చెందిన ఆసక్తికర ఫోటోలు తీసి పంపించింది. మార్స్ పై మీథేన్ అత్యధిక స్థాయిలో ఉన్నట్లు నాసా క్యూరియేసిటీ రోవర్ గుర్తించింది. అంటే మనుషులు జీవించేందుకు అవకాశం లేనట్లే. జూపిటర్ ఉపగ్రహం యూరోపాపై ఉప్పు నీటిని కనుగొన్నారు.

జూలై :

బ్లాక్ హోల్స్ ఏర్పడడానికి నక్షత్రాలు పేలిపోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఔమువామువా గ్రహ శకలం, ఏలియన్ స్పేస్ షిప్ కాదని వారు స్పష్టం చేశారు.

ఆగస్టు :

క్రాబ్ నక్షత్ర మండలంలో అత్యధిక ఎక్కువ ఎనర్జీల ప్రోటాన్లను గుర్తించారు. అతి పెద్ద అల్ట్రా మాస్సివ్ నల్లటి రంధ్రాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు.

సెప్టెంబర్ :

ఈ నెలలో 'ఇస్రో' చంద్రయాన్ -2 ప్రయోగాన్ని చేపట్టింది. విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ -2, చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో విడిపోయిన విక్రమ్ ల్యాండర్ సాంకేతిక కారణాలతో కుప్పకూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిన దృశ్యాలను తీసి పంపించింది.

అక్టోబర్ :

అక్టోబర్ లో శనిగ్రహ ఉపగ్రహం ఎన్ సెలాడస్ పై జీవం ఉంది అనే ఆధారాలను సేకరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే చంద్రుని మట్టిలో ఆక్సిజన్ ఉన్నట్లు కూడా గుర్తించారు.

నవంబర్ :

నవంబర్‌ 2వ తేదీన శనిగ్రహం ముందు నుంచి చంద్రుడు వెళ్లాడు. నవంబర్ 11న సూర్యుడి ముందు నుంచి బుధగ్రహం వెళ్లింది. మళ్లీ 2039లో ఇలాంటి దృశ్యం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.

డిసెంబర్ :

'ర్యుగు' అనే గ్రహశకలంపై జపాన్ ల్యాండర్ హయబుసా2 మట్టిని సేకరించింది. తిరిగి భూమిపై తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది డిసెంబర్ 2020న భూమికి చేరుకుంటుందని అంతరిక్ష పరిశోధన సంస్థ తెలియజేసింది. ఇలా 2019 సంవత్సరంలో సౌర కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగాయనే చెప్పాలి.

Next Story